తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మళ్లీ..వీడియో
వలసదారులను తమ దేశాలకు తిప్పి పంపే విధానంలో అగ్రరాజ్యం తీరుమార్చుకోవడంలేదు. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదు. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్నారనే కారణంతో కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి మరీ విమానాలు ఎక్కిస్తోంది. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్లిన 228 మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపింది. శని, ఆదివారాల్లో రెండు విడతలుగా అమెరికా సైనిక విమానాల్లో వీరిని భారత్‌కు తీసుకొచ్చారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాలు ల్యాండ్ అయ్యాయి. తమ చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో బంధించి తీసుకువచ్చారని భారతీయ వలసదారులు వాపోయారు. ప్రయాణం మొత్తం సంకెళ్లతోనే జరిగిందని భారతీయ వలసదారులు ఆవేదన వ్యక్తం చేశారు. విమానం దిగిన తర్వాతే తమకు వేసిన సంకెళ్లు, గొలుసులు తొలగించినట్టు తెలిపారు. తొలి విడతలో ఈ నెల 5న 104 మంది భారతీయులను వెనక్కి పంపినప్పుడు కూడా అమెరికా ఇలాగే సంకెళ్లు వేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిబ్రవరి 15న వచ్చిన విమానంలో 116 మంది, ఫిబ్రవరి 16 ఆదివారం వచ్చిన విమానంలో 112 మంది ఉన్నారు. శనివారం రాత్రి భారత్ చేరుకున్న వలసదారుల వివరాలను పరిశీలించిన అనంతరం ఆదివారం సాయంత్రం వారిని ఇళ్లకు పంపారు. ఆదివారం భారత్ చేరుకున్న వారి వివరాలను అధికారులు పరిశీలించిన అనంతరం వారిని వారి ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు. రెండో విడతలో అమెరికా నుంచి వచ్చిన వారిలో ఇద్దరు యువకులు హత్య కేసులో నిందితులుగా ఉన్నారని సమాచారం. పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లను విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో వారిపై హత్య కేసు నమోదైనట్టు తెలుస్తోంది.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

