అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగమంటే కుదరదు భయ్యా వీడియో
అమెరికాకు వెళ్ళాలంటే ఉద్యోగమా.. చదువా అనేది ముందుగా నిర్ణయించుకోవాలని నిపుణులు అంటున్నారు. ఉద్యోగమే అయితే ఈ అంశంలో నైపుణ్యం, వృత్తి అనుభవం ఉందని నిరూపిస్తే చాలు రాజమార్గంలో జాబ్ చేసుకోవచ్చనీ సూచిస్తున్నారు. చదువు కోసం యూనివర్సిటీలకు వెళ్లి వెంటనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేద్దామంటే కుదరదనీ అంటున్నారు. అమెరికాలో ఈ నిబంధనలు కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ.. వాటి అమలుకు ట్రంప్ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఐటీ నిపుణులకు వారి నైపుణ్యాలకు తగ్గట్లుగా శాలరీ ఇవ్వాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల వృత్తి నిపుణులకు ఎంతో మంచి జరిగిందనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉన్నత విద్య తర్వాత సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగం కోసం చాలా మంది కన్సల్టెంట్లను ఆశ్రయించి సంస్థల్లో పని చేస్తున్నారు. ఒక ఉద్యోగికి అమెరికా నిబంధనల మేరకు రోజుకు వంద డాలర్ల జీతం ఉంటే… కన్సల్టెన్సీల ద్వారా చేరిన వారికి 40 డాలర్లు మాత్రమే ఇస్తున్నారు. ట్రంప్ తాజా ఆదేశాలతో కన్సల్టెన్సీల పాత్ర పూర్తిగా పోయింది. సంస్థలన్నీ అమెరికా నిబంధనల మేరకు ఒకే విధంగా వేతనాలు ఇస్తున్నాయి. తప్పుడు అనుభవ పత్రాలతో ఉద్యోగం చేస్తున్న వారి పనితీరును సంస్థలు పరిశీలిస్తున్నాయి. అమెరికాలో లక్షల సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలున్నాయనీ, ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఎంఎస్ చదువుకునేందుకు అమెరికా వెళ్తున్న విద్యార్థులు.. రెండేళ్ల చదువు పూర్తయ్యాక వారు ఈ విభాగంలో స్పెషలిస్ట్ అనీ.. ఇందులో వారికి అపారమైన నైపుణ్యాలున్నాయనీ దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఆరు నెలలు లేదా ఏడాదిలోగా రాజమార్గంలో మంచి వేతనంతో ఉద్యోగం లభిస్తుందని చెబుతున్నారు. బహుళజాతి సంస్థల్లో, ఐటీ కంపెనీల్లో ఉద్యోగం రాగానే ఆరేళ్ల పాటు వీసా ఉంటుంది. అయితే మరిన్ని నైపుణ్యాలు పెంచుకుంటే అలా అమెరికాలో ఉండిపోవచ్చు.

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే

గర్ల్స్ హాస్టల్లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూడగా !!

త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..

కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు

పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే
