బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్‌ చెరలో 10 నెలల చిన్నారి మృతి

బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్‌ చెరలో 10 నెలల చిన్నారి మృతి

Phani CH

|

Updated on: Dec 01, 2023 | 1:55 PM

హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఇరువైపుల బందీలుగా ఉన్నవారు విడతలవారీగా బయటపడుతున్నారు. తాజాగా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోమారు పొడిగించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. బందీలను విడుదల కోసం మధ్యవర్తుల ప్రయత్నాల నేపథ్యంలో కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొంది. గడువు పూర్తి కావడానికి కొద్దినిమిషాల ముందు ఈ ప్రకటన వెలువడింది.

హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఇరువైపుల బందీలుగా ఉన్నవారు విడతలవారీగా బయటపడుతున్నారు. తాజాగా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోమారు పొడిగించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. బందీలను విడుదల కోసం మధ్యవర్తుల ప్రయత్నాల నేపథ్యంలో కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొంది. గడువు పూర్తి కావడానికి కొద్దినిమిషాల ముందు ఈ ప్రకటన వెలువడింది. మరోపక్క హమాస్‌ కూడా ఈ పొడిగింపును ధ్రువీకరించింది. ఈ సంధి పొడిగింపునకు ఒక ఒప్పందం కుదిరిందని హమాస్ తెలిపింది. కానీ ఆ ఒప్పందానికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. శుక్రవారం వరకు ఈ సంధి కొనసాగుతుందని ఖతార్‌ తెలిపింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిపి దాదాపు 240 మందిని హమాస్ కిడ్నాప్‌ చేసింది. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఆ పిల్లల్లో 10 నెలల చిన్నారి మృతి చెందినట్లు హమాస్ తాజాగా ప్రకటించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆక్సిజన్‌ సిలిండర్‌తో పోలింగ్‌ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం

మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు.. సమీపంలో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు

వావ్‌ !! ఓటీటీలోకి పొలిమేర2 డేట్ కన్ఫర్మ్

Allu Arjun: లేడీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్

మా ఆయన చనిపోలేదు.. నమ్మొద్దు !! విజయ్‌కాంత్‌ భార్య ఎమోనల్‌