మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు.. సమీపంలో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్నికల నిర్వాహకులు, సిబ్బంది ఓటు వేసేందుకు అందరికీ ఆసక్తి కలిగేలా ఏర్పాట్లు చేశారు. మహిళలకోసం ప్రత్యేకంగా మోడల్‌ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసారు. మహిళలు, వృద్ధులకుఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సదుపాయాలను సైతం అందుబాటులో ఉంచారు. మీ ఓటు మీ బలం కాన్సెప్ట్‌తో ప్రతి సజిల్లాలో ఐదు మోడల్‌ పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.

మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు.. సమీపంలో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు

|

Updated on: Dec 01, 2023 | 1:57 PM

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్నికల నిర్వాహకులు, సిబ్బంది ఓటు వేసేందుకు అందరికీ ఆసక్తి కలిగేలా ఏర్పాట్లు చేశారు. మహిళలకోసం ప్రత్యేకంగా మోడల్‌ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసారు. మహిళలు, వృద్ధులకుఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సదుపాయాలను సైతం అందుబాటులో ఉంచారు. మీ ఓటు మీ బలం కాన్సెప్ట్‌తో ప్రతి సజిల్లాలో ఐదు మోడల్‌ పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మోడల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన మహిళల కోసం హెల్పింగ్ డెస్క్, డాక్టర్స్ రూము, వెయిటింగ్ రూమ్స్, సెల్ఫీ తీసుకోవడానికి సెల్ఫీ స్పాట్‌లను సైతం ఏర్పాటు చేశారు. ఓటు వేసి వచ్చిన తర్వాత ఓటర్లకు వాటర్‌ బాటిల్‌తోపాటు గులాబీని అందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఎన్నికల సిబ్బంది. ఇదంతా ప్రజలను ఆకర్షించడానికి ఓటు వేసే విధంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికే చేస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావ్‌ !! ఓటీటీలోకి పొలిమేర2 డేట్ కన్ఫర్మ్

Allu Arjun: లేడీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్

మా ఆయన చనిపోలేదు.. నమ్మొద్దు !! విజయ్‌కాంత్‌ భార్య ఎమోనల్‌

రికార్డ్‌ బద్దల్ ఖాయం.. దిమ్మతిరిగేలా చేస్తున్న యానిమల్ అడ్వాన్స్‌ బుకింగ్స్

Hi Nanna: పరువు పాయే.. నాని ఇది నీకు న్యాయమా !!

Follow us