Watch Video: చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..

ఓటు హక్కును వినియోగించుకున్న దివ్యాంగ ఓటరు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు చేతులు లేకపోయినా ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పాడు. ఆసిఫాబాద్ జిల్లాలో, సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు చెందిన ఈ యువకుడికి రెండు చేతులు లేవు. నడిచేందుకు, రాసేందుకు కాళ్లనే ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఎన్నికల సందర్భంగా చేతులు లేని ఈ యువకుడు తన కాలితో ఈవీఎం బటన్ నొక్కి ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

Watch Video: చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..

|

Updated on: May 13, 2024 | 1:01 PM

ఓటు హక్కును వినియోగించుకున్న దివ్యాంగ ఓటరు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు చేతులు లేకపోయినా ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పాడు. ఆసిఫాబాద్ జిల్లాలో, సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు చెందిన ఈ యువకుడికి రెండు చేతులు లేవు. నడిచేందుకు, రాసేందుకు కాళ్లనే ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఎన్నికల సందర్భంగా చేతులు లేని ఈ యువకుడు తన కాలితో ఈవీఎం బటన్ నొక్కి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీనికంటే ముందు చేతులు లేవని ఇంట్లోనే కూర్చోకుండా ఉన్నంతలో పోరాడాలని తనకు రాజ్యంగం ఐదేళ్లకు ఒక్కసారి కల్పించిన హక్కును వినియోగించుకోవాలని దృఢంగా సంకల్పించాడు. దీంతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన కాలి బొటన వేలికి గర్వంగా సిరా వేసుకున్నాడు. ఓటు వేసేందుకు సంబంధించిన పూర్తి ప్రక్రియను ఎన్నికల అధికారులు చెప్పిన విధంగా కాళ్ల వేలితో పూర్తి చేశాడు. ఆ తరువాత తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధులలో తనకు మంచి చేసిన వారిని ఎంచుకున్నాడు. చేతులు లేవని చలికలపడిపోకుండా ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచాడు. అన్నీ ఉన్నా ఓటు వేసేందుకు ఆసక్తి చూపని వారికి కనువిప్పు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్