Pak spy: పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్న అమ్మాయి తనను ప్రేమిస్తుందనుకున్న ఓ ఇంజినీర్ రక్షణశాఖ రహస్యాలను ఆమెకు చేరవేశాడు. చివరికి సీఐడీ అధికారులకు చిక్కి జైలుపాలయ్యాడు. నిందితుడు ప్రవీణ్ మిశ్రా భారత దళాలకు క్షిపణి, డ్రోన్ విడిభాగాలను సరఫరా చేసే ఓ సంస్థలో పని చేశాడు. అతడికి ఫేస్‌బుక్‌లో సోనాల్ గర్గ్ అనే మహిళ పరిచయమైంది. తను చండీఘడ్‌లోని ఐబీఎం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు చెప్పుకొంది. వాస్తవానికి ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆపరేటీవ్.

సోనల్ భారత్‌కు చెందిన ఫోన్ నెంబర్‌ను పొంది మిశ్రాతో ఛాటింగ్ చేసేది. దీంతో ఆమె కోసం సైన్యం, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని మిశ్రా సేకరించాడు. ఈ క్రమంలో అంకాలేశ్వర్‌లోని ఓ కంపెనీకి చెందిన సున్నితమైన సమాచారం సేకరించాడు. ఆ కంపెనీ కంప్యూటర్లలో మాల్‌వేర్‌ను చొప్పించేందుకు కూడా ప్రయత్నించాడు. అతడి కదలికలను ఉదంపూర్‌లోని మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. తక్షణమే గుజరాత్ అధికారులను అప్రమత్తం చేసింది. మొత్తంమీద అతడిని గుజరాత్ సీఐడీ అధికారులు భరూచ్ జిల్లాలో అరెస్టు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.