Rahul Dravid: భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ్చన్న జై షా

Rahul Dravid: భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ్చన్న జై షా

Anil kumar poka

|

Updated on: May 13, 2024 | 11:45 AM

భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌ వస్తున్నారా..? బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించిన సమాచారం ప్రకారం నిజమేనంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నవంబర్ 2021 నుంచి 2023 వరకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ను టీ20 ప్రపంచ కప్‌ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది. జూన్ 1 నుంచి పొట్టి కప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌ వస్తున్నారా..? బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించిన సమాచారం ప్రకారం నిజమేనంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నవంబర్ 2021 నుంచి 2023 వరకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ను టీ20 ప్రపంచ కప్‌ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది. జూన్ 1 నుంచి పొట్టి కప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీ ముగిసే వరకూ అతడే కోచ్‌గా ఉంటాడు. ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. మళ్లీ కొనసాగడానికి ద్రవిడ్‌ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్‌ కోసం ప్రకటన ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. రాహుల్ పదవీ కాలం జూన్‌ వరకే ఉందనీ ఒకవేళ అతడు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. చేసుకోవచ్చు అని జై షా తెలిపారు. కొత్త కోచ్‌ భారత్‌ నుంచి ఉంటారా? విదేశీయుడా? అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. క్రికెట్‌ అపెక్స్‌ కౌన్సిల్ నిర్ణయం మేరకే ఉంటుందనీ తమకు ప్రత్యేకంగా విభాగం ఉందని చెప్పారు. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను నియమిస్తారా? అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయనీ ఆ నిర్ణయం కూడా సీఏసీ తీసుకుంటుందని అన్నారు. తమ జట్టులో మూడు ఫార్మాట్లు ఆడే క్రికెటర్లు ఉన్నారనీ విరాట్, రోహిత్, రిషభ్‌ పంత్‌.. ఇలా చాలా మంది అన్ని ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నారని జైషా తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.