Siblings Escape: 14 అంతస్థుల భవనంలో మంటలు... అక్కా తమ్ముళ్ల షాకింగ్‌ పని..!(వీడియో)

Siblings Escape: 14 అంతస్థుల భవనంలో మంటలు… అక్కా తమ్ముళ్ల షాకింగ్‌ పని..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 31, 2021 | 9:19 AM

న్యూయార్క్ నగరం ఈస్ట్ విలేజ్‌లోని ఓ 14-అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది...జాకబ్ రియిస్‌గా పిలువబడే 14 అంతస్తుల భవనంలోని నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలతో అగ్నికిలలు ఎగిసి పడ్డాయి.


న్యూయార్క్ నగరం ఈస్ట్ విలేజ్‌లోని ఓ 14-అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది…జాకబ్ రియిస్‌గా పిలువబడే 14 అంతస్తుల భవనంలోని నాల్గవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలతో అగ్నికిలలు ఎగిసి పడ్డాయి. బిల్డింగ్లోని ఓ పోర్షన్‌లో ఓ కుటుంబం ఇరుక్కుపోయింది..ఆ ఇంట్లోని తల్లి ఆమె కూతురు, కొడుకు ఉండిపోయారు..ఈ క్రమంలోనే ఆ ఇద్దరు అక్కా తమ్ముళ్లు ఎవరూ చేయని సాహసం చేశారు..ఓ వైపు మంటలు ఎగిసిపడుతుంటే..ఆ భవనం కిటికి గుండా బయటికి రావడానికి ప్రయత్నించారు.. వారి ప్రయత్నం సక్సెస్‌ కావటంతో సురక్షితంగా బయటపడ్డారు..బిల్డింగ్‌కు ఆనుకుని ఉన్న పైపు సాయంతో ఎట్టకేలకు నెమ్మదిగా కిందకి వచ్చేశారు. కానీ, వారి తల్లి మాత్రం మంటల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి..తల్లిని కాపాడేందుకు ఆ అక్కాతమ్ముడు తీవ్రంగా ప్రయత్నించారు..కానీ, ఆమె గదిలోపల వైపు గడివేసి ఉండటం, తీసేందుకు వీలు కాకపోవటంతో ఆమె ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది..మరో వృద్ధుడు కూడా భవనంలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిసింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది వచ్చే లోపుగానే ఈ ఇద్దరూ అక్కతమ్ముడు ఏదోరకంగా ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దాంతో అంతా వారిని ప్రశంసలతో ముంచెత్తారు.