ప్రపంచంలోనే అతి చిన్న దేశం.. వాటికన్ కంటె చిన్నది ఏందంటే ??
ఒక దేశంలో సాధారణంగా లక్షల మంది ఉంటారు. కానీ ప్రపంచంలోని ఓ అతి చిన్న దేశంలో 27 మంది మాత్రమే ఉన్నారంటే నమ్ముతారా? వాటికన్ కంట్రీని ప్రపంచంలోనే అతి చిన్న దేశమని అనుకుంటాం. కానీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం మరోటుంది. పేరు సీలాండ్. వాటికన్ సిటీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కానీ సీలాండ్‌ను అలా గుర్తించలేదు.
ఈ దేశం పరిమాణం చాలా చిన్నది. ఇక్కడ 27 మంది మాత్రమే నివసిస్తున్నారు. యూకేలోని సఫోక్ సముద్ర తీరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వింత దేశం పేరు ‘సీలాండ్’. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై పూర్తిగా మానవ నిర్మిత ప్రదేశం ఇది. ఇది 1967 సెప్టెంబర్ 2న ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి యూకే ప్రభుత్వం సముద్రం మధ్య రెండు భారీ రాతి స్తంభాలను కలుపుతూ అక్కడ తన రక్షణ అవసరాల కోసం కోటను నిర్మించింది. ఆ తర్వాత సముద్రపు దొంగలు లేదా పైరేట్స్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. పైరేట్ల రేడియో స్టేషన్ అధినేత ప్యాడీ రే బేట్స్ 1967లో ఆ కోటను ఆక్రమించుకుని ప్రత్యేక దేశంగా ప్రకటించాడు. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయగీతం కూడా ఉన్నాయి. ఈ దేశం తన పౌరులకు పాస్‌పోర్టులూ స్టాంప్‌లు విడుదల చేసింది. సముద్రంలో రెండు స్తంభాలపైన ఓ దేశం.. ప్రపంచంలోనే అతి చిన్నదైన సీలాండ్‌ను మైక్రోనేషన్ అని కూడా అంటారు. సీలాండ్ వైశాల్యం కేవలం 250 మీటర్లు అంటే పావు కిలోమీటరు మాత్రమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షుగర్ పేషెంట్స్.. మామిడి తినాలా? వద్దా? అనే డైలమా ఇక వదిలేయండి
పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా.. వధూవరుల పై నెటిజెన్స్ ఫైర్
మరిన్ని S-400లు కొనే యోచనలో భారత్ ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

