సౌదీలో బానిసత్వ చట్టం రద్దు.. మనోళ్లకు స్వేచ్ఛ
సౌదీ అరేబియాలో మగ్గిపోతున్న భారతీయ కార్మికులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్ళుగా బానిసత్వంలో మగ్గిపోతున్న కార్మికులకు స్వేచ్ఛ లభించింది. ఆ దేశంలో ఉన్న కఫాలా వ్యవస్థ ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు 1.3 కోట్ల వలసదారులు బానిసత్వం నుంచి బయటికి రానున్నారు.
సౌదీలో భారతీయులే 25 లక్షల మంది ఉంటారు. సౌదీలో కఫాలా స్పాన్సర్ షిప్ వ్యవస్థను 1950లో ప్రారంభించారు. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన విదేశీ కార్మికుల నిర్వహణ కోసం దీనిని రూపొందించారు. సౌదీకు ఎవరు ఉపాధి కోసం వెళ్ళినా వారు ఈ కఫాలా వ్యవస్థతో ముడిపడి ఉంటారు. దీని గురించే తెలిసే కార్మికులు అక్కడికి వెళతారు. వలసదారుని నివాసం, ఉద్యోగం, చట్టపరమైన హోదా అంతా ఈ కఫాలా వ్యవస్థదారుల చేతిలోనే ఉంటుంది. సౌదీలో పని చేసేవారు అక్కడికి వెళ్ళగానే తమ పాస్‌పోర్ట్‌ను యజమానికి అప్పగించాల్సి ఉంటుంది. ఆ తరువాత కార్మికుడు ఉద్యోగం మారాలన్నా, దేశం విడిచి వెళ్ళాలన్నా యజమాని అనుమతి ఇవ్వాల్సిందే. దీని కారణంగా సౌదీలో చిక్కుకుని బాధలు పడిన వారు ఉన్నారు. దీనిపై మానవ హక్కుల సంఘాలు ఎక్కువగా విమర్శించేవి. స్పాన్సర్‌షిప్ ముసుగులో గల్ఫ్ దేశాలు మానవ అక్రమ రవాణా చేస్తున్నాయని పలు దేశాలు ఆరోపించాయి. ఇప్పటికే దీన్ని ఇజ్రాయెల్, బహ్రెయిన్ లు రద్దు చేశాయి. కానీ, కువైట్, ఒమన్, లెబనాన్, ఖతార్లో వివిధ రూపాల్లో ఇంకా కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛీ.. శవం చేతి బంగారు కడియాన్నివదలని హాస్పిటల్ సిబ్బంది
ఈ లేడీ జేమ్స్ బాండ్’రూటే సపరేటు
రైలు నుంచి పడి భర్త మృతి.. 23 ఏళ్ల తర్వాత ఆమెకు పరిహారం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

