అమెరికా విద్యార్థి వీసా రూల్స్ మరింత కఠినం.. భారత విద్యార్థులకు ఇబ్బందే
భారతీయ విద్యార్ధుల అమెరికా కలలు ఇక కల్లలేనా? అగ్రరాజ్యంలో ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని కలలు కనే ఎందరో భారతీయ విద్యార్ధుల ఆశలపై నీళ్లు అగ్రరాజ్యం ఇమిగ్రేషన్ విభాగం నీళ్లు చల్లింది. స్టూడెంట్ వీసాపై ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం విద్యార్ధుల ప్రణాళికలను అయోమయంలో పడేసింది.
లక్షల్లో అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న వారికి ఈ కొత్త నిబంధనలు మరింత సవాలుగా మారాయి. గతంలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండేవారు. కానీ, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం, ఇప్పుడు స్టూడెంట్ వీసాను గరిష్ఠంగా నాలుగేళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఈ సమయంలోగా విద్యార్ధులు తమ కోర్సు పూర్తికాకపోతే, వీసా పొడిగింపు కోసం మళ్లీ యూఎస్‌సీఐఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అయితే వీసా పొడిగిస్తారా అంటే కచ్చితమైన హామీలేమీ లేవు. దీంతో ఎక్కువ కాలం పట్టే పీహెచ్‌డీ వంటి రీసెర్చ్ కోర్సులు చేసే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ వీసా మార్పుల్లో మరో ముఖ్యమైన మార్పు…వీసా రెన్యూవల్ ప్రక్రియ. గతంలో ఉన్న ‘ఇంటర్వ్యూ వేవర్’ లేదా ‘డ్రాప్‌బాక్స్’ సదుపాయాన్ని ఇప్పుడు చాలావరకు తొలగించారు. దీనివల్ల 2025 సెప్టెంబర్ తర్వాత వీసా రెన్యూవల్ చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా కాన్సులేట్‌కు వెళ్లి ప్రత్యక్ష ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల అపాయింట్‌మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావడం, ముఖ్యంగా సెలవులకు భారత్ వచ్చి తిరిగి వెళ్లే విద్యార్థుల ప్రయాణ ప్రణాళికల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఓ సానుకూల అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. హెచ్-1బీ వీసా కోసం లాటరీ పద్ధతిలో వేచి చూడకుండా, తమ రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారు నేరుగా ఓ-1 వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవార్డులు, పరిశోధనా పత్రాలు, అధిక వేతనం వంటివి ఉన్న విద్యార్థులు ఎఫ్-1 వీసా నుంచి దీనికి మారే అవకాశం కల్పించారు. అయితే, ఇది పరిమిత సంఖ్యలో ఉన్న అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కొత్త మార్పుల వల్ల అమెరికాలో ఉన్నత విద్య చదివి, అక్కడే స్థిరపడాలనుకునే భారత విద్యార్థుల ప్రయాణం మరింత కష్టతరం అయింది. విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌదీలో బానిసత్వ చట్టం రద్దు.. మనోళ్లకు స్వేచ్ఛ
ఛీ.. శవం చేతి బంగారు కడియాన్నివదలని హాస్పిటల్ సిబ్బంది
ఈ లేడీ జేమ్స్ బాండ్’రూటే సపరేటు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

