AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు ఆన్‌లైన్ ఉగ్రవాద కోర్సు

మహిళలకు ఆన్‌లైన్ ఉగ్రవాద కోర్సు

Phani CH
|

Updated on: Oct 25, 2025 | 11:11 AM

Share

పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. మహిళా విభాగం జమాతుల్ మోమినాత్ ను సృష్టించి, దీని ద్వారా మహిళలకు జీహాద్ శిక్షణ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆన్‌లైన్‌ శిక్షణ కోర్సును ఉగ్రవాద సంస్థ ప్రారంభించింది. దీని ద్వారా నిధులు సేకరణ, ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్లను చేపట్టనుంది. ఈ కోర్సులో జైషే నేతల కుటుంబసభ్యులు జీహద్ గురించి, ఇస్లాం గురించి, వారి విధుల గురించి ఇతరులకు బోధిస్తారు.

‘ఉపన్యాసాలు’ రోజుకు కనీసం 40 నిమిషాలు ఉంటాయి. మసూద్ అజార్ ఇద్దరు చెల్లెళ్ళు సాదియా అజర్, సమైరా అజర్ దీనికి నాయకత్వం వహిస్తారు. ఈ ఉపన్యాసాల ద్వారా మహిళలు జమాత్ ఉల్-మోమినాత్‌లో చేరేలా ప్రోత్సహిస్తారు. మసూద్ పెద్ద చెల్లెలు సాదియా ఇప్పటికే బాధ్యతలు చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో పాక్, పీఓకేలోని మూడు ఉగ్రవాద సంస్థలకు చెందిన మొత్తం 9 స్థావరాలను ధ్వంసం చేసింది. వాటిలో జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం బహావల్పూర్ కూడా ఉంది. అయినా ఈ ఉగ్రనాగులు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. బహావల్పూర్‌పై భారత్ సైన్యం జరిపిన దాడిలో మసూద్ కుటుంబానికి చెందిన పలువురు హతమవ్వగా.. వారిలో సాదియా భర్త కూడా ఒకరు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఉమర్ ఫరూక్ భార్య అఫ్రీర్ ఫరూక్ కూడా ఈ సంస్థలో చేరారు. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడానికి అనుమతించడం లేదని వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికే జైష్‌ ఎ మహమ్మద్ ఉగ్రసంస్థ ఈ మహిళా ఆన్‌లైన్ విభాగాన్ని ప్రారంభించిందని వార్తలొస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా విద్యార్థి వీసా రూల్స్ మరింత కఠినం.. భారత విద్యార్థులకు ఇబ్బందే

సౌదీలో బానిసత్వ చట్టం రద్దు.. మనోళ్లకు స్వేచ్ఛ

ఛీ.. శవం చేతి బంగారు కడియాన్నివదలని హాస్పిటల్ సిబ్బంది

ఈ లేడీ జేమ్స్ బాండ్’రూటే సపరేటు

రైలు నుంచి పడి భర్త మృతి.. 23 ఏళ్ల తర్వాత ఆమెకు పరిహారం