AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లేడీ జేమ్స్ బాండ్'రూటే సపరేటు

ఈ లేడీ జేమ్స్ బాండ్’రూటే సపరేటు

Phani CH
|

Updated on: Oct 25, 2025 | 10:38 AM

Share

డిటెక్టివ్ లుగా మగవారే రాణించగలరనే అభిప్రాయం ఉన్న వృత్తిలోకి రజనీ పండిట్‌ ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసారు. నాలుగు దశాబ్దాలుగా కొన్ని వేలకు పైగా కేసులను విజయవంతంగా ఛేదించడం ద్వారా, రహస్యాలను వెలికితీసి సత్యాన్ని సమాజం ముందు ఉంచారామె. 1962లో మహారాష్ట్రలో జన్మించిన రజనీ చిన్నప్పుడే, తన చుట్టూ జరిగే అన్యాయాలపై పోరాడాలనే కసితో పెరిగింది.

CID సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన తండ్రే ఆమెకు స్ఫూర్తి. డ్రగ్స్‌కు బానిసైన తోటి క్లాస్‌మేట్‌ను దాన్నుంచి బయటపడేసింది. ఆ ఘటనే ఆమెను డిటెక్టివ్‌ వృత్తిని ఎంచుకునేలా చేసింది. డిటెక్టివ్‌గా పని చేయాలంటే కేసు మూలాల్లోకి వెళ్లి వాస్తవాలను కూపీ లాగాలి. పరిస్థితులకు తగ్గట్టు కలిసిపోవడం, ఇతరుల విశ్వాసం పొందడం కూడా ముఖ్యం. ఈ విషయంలో ఆమె మేటిగా నిలిచారు. ఆమె ఒకసారి ఇంటి పనిమనిషిగా వేషం వేసి, ఒక కుటుంబంలో పనిచేసినట్లు నటించింది. ఆ సమయంలో ఆమె ఆ ఇంటి సభ్యుల నమ్మకాన్ని పొందారు. వారి మాటల్లోంచి, ప్రవర్తనలోంచి ముఖ్యమైన ఆధారాలను వెలికితీసారు. మరో సందర్భంలో గర్భిణి వేషం వేసి ప్రజల సానుభూతిని గెలుచుకున్నారు. ప్రజలు ఆత్మీయంగా మాట్లాడినప్పుడు వారు తెలియకుండా చెప్పిన వివరాలు కేసు ఛేదనకు కీలకమయ్యాయి. అలాగే వీధి విక్రేతగా నటించి అనుమానాస్పద వ్యక్తుల ప్రవర్తనను గమనించి వారి రహస్యాలను బహిర్గతం చేశారు. ప్రతి వేషం కోసం వారాలు, కొన్నిసార్లు నెలలపాటు సాధన చేసి, ఆ పాత్రలో పూర్తిగా మమేకం కావడం ఆమె ప్రత్యేకత. 1986లో ఆమె తన సొంత డిటెక్టివ్ ఏజెన్సీని స్థాపించారు. ‘రజనీ పండిట్ డిటెక్టివ్ సర్వీసెస్’ కుటుంబ కలహాలు, కార్పొరేట్ మోసాలు, తప్పిపోయిన వ్యక్తుల కేసులు, రాజకీయ దర్యాప్తులు వంటి విభిన్న అంశాలను తీసుకుని పనిచేస్తుంది. క్రమంగా ఇది విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. భారతదేశపు తొలి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్‌గా గుర్తింపుపొందిన రజనీ పండిట్‌ తన వెబ్‌సైట్‌లో 75,000 కంటే ఎక్కువ కేసులను చేధించినట్లు రాసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు నుంచి పడి భర్త మృతి.. 23 ఏళ్ల తర్వాత ఆమెకు పరిహారం

టీవీ9 పరిశీలనలో బయటపడిన ట్రావెల్స్‌ నిర్లక్ష్యం

కామాంధుడికి 32 ఏళ్ల జైలు శిక్ష..

ఉద్యోగులకు అమెజాన్ ఊహించని షాక్.. 5 లక్షల మంది ఔట్

తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమం