కామాంధుడికి 32 ఏళ్ల జైలు శిక్ష..
నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడికి 32 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. నల్లగొండ పట్టణం పానగల్ కు చెందిన గురజల చందు అనే యువకుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నార్కెట్ పల్లి మండలానికి చెందిన మైనర్ బాలికతో చందు పరిచయం పెంచుకున్నాడు.
తరచూ బాలికతో ఫోన్ లో మాట్లాడే చందు 19 సెప్టెంబర్ 2022న మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లాడు. దీంతో బాలిక బంధువులు నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చందు పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. తనపై కిడ్నాప్ కేస్ పెట్టిన విషయాన్ని తెలుసుకున్న చందు సెప్టెంబర్ 20, 2022న బాలికను నల్లగొండలో వదిలి పరారయ్యాడు. బాధిత బాలికను పోలీసులు భరోసా కేంద్రానికి తరలించారు. తనను మభ్యపెట్టి గుడికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడని, అక్కడినుంచి పానగల్ లోని తన కుటుంబ సభ్యులకు వద్దకు తీసుకువెళ్లి భార్యాభర్తలం అని చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలిక పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు చందుపై కిడ్నాప్ కేస్ తో పాటు పోక్సో కేసును కూడా నమోదు చేశారు. పూర్తి సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు పోక్సో కోర్టులో 15 నవంబర్ 2022న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడికి 32 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా ఫోక్సొ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 75 వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం, ఇవ్వాలని పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగులకు అమెజాన్ ఊహించని షాక్.. 5 లక్షల మంది ఔట్
తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమం
భూమికి రెండో చంద్రుడు !! 2083 వరకు మనతోనే
పొలం పనుల్లో కూలీలు బిజీ.. అంతలోనే చిరుత
తెలంగాణలో రాకాసి ఏనుగు శిలాజం.. బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శన
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

