Atlanta: సీలింగ్ నుంచి ఊడిపడిన దొంగలు.! 1,50,000 డాలర్ల దోపిడీ..
అమెరికాలోని అట్లాంటాలో ఓ స్టోర్స్‌లో దోపిడీ ముఠా డబ్బును దోచుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ముఠా సభ్యులు దోపిడికీ ముందే షాపు సీలింగ్‌లోకి చేరుకున్నారు. దుకాణంలో పనిచేసే ఓ ఉద్యోగిని నడుచుకుంటూ వస్తుండగా.. అదే సమయంలో సీలింగ్‌ను బద్దలు కొట్టుకుని వారు కిందకు దూకారు. ఈ హఠాత్పరిణామంతో ఆమె బెంబేలెత్తిపోయింది. ఆ దొంగ ఆమెను బెదిరిస్తుండగా.. రెండో ముష్కరుడు కూడా కిందకు దూకాడు.

వీరిద్దరూ కలిసి ఆ ఉద్యోగినిని ఓ గదిలోకి తీసుకెళ్లి.. అక్కడున్న సేఫ్‌ను తెరిపించి.. అందులోని సొమ్మును తమ బ్యాగ్స్‌లోకి సర్దుకొన్నారు. ఆ తర్వాత ఆమెను అక్కడే టేపులతో కట్టేశారు. అనంతరం ఒకడు మాస్క్ తీయగా.. మరొకడు మాత్రం తీయలేదు. తాపీగా డోర్ తీసుకొని బయటకు వెళ్లిపోయారు. అదే సమయంలో మరో మహిళ దుకాణంలోకి రాబోతూ.. వారి అవతారాలను చూసి అవాక్కైంది. దొంగలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తమ బ్యాగ్‌లతో అక్కడినుంచి ఉడాయించారు. అట్లాంటా చెక్ క్యాషియర్స్‌లో జరిగిన ఈ దోపిడీలో మొత్తం 1,50,500 డాలర్లను వారు దోచుకొన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.