Right to Disconnect: ఆఫీస్ అయ్యాక బాస్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయనక్కర్లేదట.?

ఆస్ట్రేలియాలో ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ రూల్ అమల్లోకి వచ్చింది. ఈ నియమం కింద ఉద్యోగులు పని గంటలు పూర్తయ్యాక, తమ బాస్ నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేసుకోవాల్సిన లేదా వాళ్ల మెసేజ్‌లను చదవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ఇలా డిస్‌కనెక్ట్ అయిన ఉద్యోగులను శిక్షించే అధికారం బాస్‌లకు ఉండదు. ఆస్ట్రేలియాలో ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ రూల్ అమల్లోకి వచ్చింది. ఈ నియమం కింద ఉద్యోగులు

Right to Disconnect: ఆఫీస్ అయ్యాక బాస్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయనక్కర్లేదట.?

|

Updated on: Sep 24, 2024 | 9:56 PM

ఆస్ట్రేలియాలో ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ రూల్ అమల్లోకి వచ్చింది. ఈ నియమం కింద ఉద్యోగులు పని గంటలు పూర్తయ్యాక, తమ బాస్ నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేసుకోవాల్సిన లేదా వాళ్ల మెసేజ్‌లను చదవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ఇలా డిస్‌కనెక్ట్ అయిన ఉద్యోగులను శిక్షించే అధికారం బాస్‌లకు ఉండదు. నిబంధనల ప్రకారం యజమానులు, ఉద్యోగులు వివాదాలను తమలో తాము పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. వారు పరిష్కరించుకోలేకపోతే, ఆస్ట్రేలియా ఫెయిర్ వర్క్ కమిషన్ ను సంప్రదించవచ్చు. పరిష్కారంలో భాగంగా పని గంటల తర్వాత ఉద్యోగిని సంప్రదించడం మానేయమని ఎఫ్‌డబ్ల్యూసీ యజమానిని ఆదేశించొచ్చు.

ఎఫ్‌డబ్ల్యూసీ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే ఒక ఉద్యోగికి గరిష్టంగా సుమారు 19,000 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 11 లక్షల రూపాయలు, సంస్థకైతే 94,000 ఆస్ట్రేలియన్ డాలర్ల అంటే 54 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అయితే కొత్త చట్టంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. గత సంవత్సరం విడుదలైన ఒక సర్వే ప్రకారం…ఆస్ట్రేలియన్లు సంవత్సరానికి సగటున 281 గంటలు వేతనం లేకుండా అదనంగా పని చేశారు. ప్రపంచంలో 20 కంటే ఎక్కువ దేశాల్లో ప్రధానంగా యూరప్, లాటిన్ అమెరికాలో ఇలాంటి నియమాలు ఇప్పటికే ఉన్నాయి. అయితే, ఆఫీసు పని అయ్యాక బాస్‌లు తమ ఉద్యోగులకు కాల్ చేయడాన్ని ఈ చట్టం నిషేధించదు. దానికి ఉద్యోగులు స్పందించాలా లేదా అన్నది మాత్రం వారి ఇష్టం.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us