Kinmemai Rice: కిన్మెమై బియ్యం గురించి విన్నారా.? ధర తెలిస్తే ఖంగుతింటారు!

జపాన్‌కి చెందిన కిన్మేమై బియ్యం సాధారణ తెల్లటి బియ్యం మాదిరిగానే ఉంటాయి. అయితే ఈ బియ్యాన్ని ప్రత్యేక ప్రాసెసింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. పేటెంట్‌ పొందిన ‍ప్రత్యేక సాంకేతిక ప్రక్రియలో అభివృద్ది చేస్తారు. ముఖ్యంగా ఆహార ప్రియులకు మంచి పోషకాలను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బియ్యం ఇవి. ఇక ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే వండే ముందు కడగాల్సిన పని ఉండదు.

Kinmemai Rice: కిన్మెమై బియ్యం గురించి విన్నారా.? ధర తెలిస్తే ఖంగుతింటారు!

|

Updated on: Sep 24, 2024 | 10:06 PM

జపాన్‌కి చెందిన కిన్మేమై బియ్యం సాధారణ తెల్లటి బియ్యం మాదిరిగానే ఉంటాయి. అయితే ఈ బియ్యాన్ని ప్రత్యేక ప్రాసెసింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. పేటెంట్‌ పొందిన ‍ప్రత్యేక సాంకేతిక ప్రక్రియలో అభివృద్ది చేస్తారు. ముఖ్యంగా ఆహార ప్రియులకు మంచి పోషకాలను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బియ్యం ఇవి. ఇక ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే వండే ముందు కడగాల్సిన పని ఉండదు. ఈ బియ్యం వాడకం వల్ల నీటి వృథాను తగ్గించొచ్చు. ఇవి రుచికి కమ్మదనంతో కూడిన స్వీట్‌నెస్‌తో ఉంటాయి. సంప్రదాయ తెల్ల బియ్యం కంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు బ్రౌన్‌ రైస్‌ మాదిరి ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన చెస్ట్‌నట్‌ రంగు ఉన్నతమైన పోషకాహార ప్రొఫైల్‌ని కలిగి ఉంటుంది. అలాగే తొందరగా ఉడికిపోతుంది. మార్కెట్‌లో ఈ బియ్యం కిలో ధర 15 వేల రూపాయలు పలుకుతోంది. ధరల పరంగా అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డు సాధించింది. అయితే జపాన్‌లో ఈ బియ్యాన్ని ఒక పెట్టెలో 140 గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్‌ చేసి విక్రయిస్తుంటారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us