అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్​ ఫోన్లు !! సైబర్‌ దాడే కారణమా ??

అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్​ ఫోన్లు !! సైబర్‌ దాడే కారణమా ??

Phani CH

|

Updated on: Feb 26, 2024 | 8:38 PM

అమెరికాలో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఏటీ&టీ, వెరిజోన్‌, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ తెలిపింది. అనేక గంటల పాటు ఈ సమస్య కొనసాగింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్‌ సమస్య ఎదుర్కొన్నారు. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నిట్లో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఏటీ&టీ, వెరిజోన్‌, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ తెలిపింది. అనేక గంటల పాటు ఈ సమస్య కొనసాగింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్‌ సమస్య ఎదుర్కొన్నారు. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నిట్లో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. గురువారం మధ్యాహ్నానికి సమస్యను పరిష్కరించినట్లు ఏటీ&టీ తన వెబ్​సైట్ ద్వారా ప్రకటించింది. వెరిజోన్‌కు వెయ్యికి పైగా ఫిర్యాదులు రాగా, టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 73 వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి 1,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. బూస్ట్ మొబైల్ కు 700 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. అత్యవసర సేవల కోసం 911 ప్రయత్నించే వారిపైనా దీని ప్రభావం పడినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. అయితే, ఈ భారీ అంతరాయానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. సైబర్‌ దాడిపై అనుమానం వ్యక్తంచేస్తూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నక్షత్రం ఆకారంలో రామాలయం.. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర !!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో

Mukesh Ambani: కొత్త కోడలికి ముకేశ్‌ అంబానీ అదిరిపోయే గిఫ్టులు‌

ఒంటిపై మంచు గడ్డకట్టేస్తున్నా చలించకుండా ధ్యానం !! ఎవరు ఆయన ??

ఊహకు అందనంత వేగంగా కుంగిపోతున్న అమెరికా నగరాలు !!