Mukesh Ambani: కొత్త కోడలికి ముకేశ్ అంబానీ అదిరిపోయే గిఫ్టులు
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ క్రమంలో ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు ‘రాధికా మర్చంట్’కు ఖరీదైన గిఫ్టులు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదుచేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి.
దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ క్రమంలో ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు ‘రాధికా మర్చంట్’కు ఖరీదైన గిఫ్టులు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదుచేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింటి వారు తమ కాబోయే కోడలికి ముందుగానే సుమారు రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్‌లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. కాగా, రాధికా మర్చంట్ గతంలో ఒక పార్టీలో తన అత్తగారు నీతా అంబానీకి చెందిన డైమండ్ చోకర్ ధరించి కనిపించారు. అది అత్యంత విలువైన ముత్యాలు, వజ్రాలు పొదిగిన డైమండ్ చోకర్. కాగా, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరవుతారని సమాచారం. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్‌తో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా వేడుకలకు రానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంటిపై మంచు గడ్డకట్టేస్తున్నా చలించకుండా ధ్యానం !! ఎవరు ఆయన ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

