ఒంటిపై మంచు గడ్డకట్టేస్తున్నా చలించకుండా ధ్యానం !! ఎవరు ఆయన ??

ఒంటిపై మంచు గడ్డకట్టేస్తున్నా చలించకుండా ధ్యానం !! ఎవరు ఆయన ??

Phani CH

|

Updated on: Feb 26, 2024 | 8:04 PM

సన్యాసులు, స్వామీజీలు ఆథ్యాత్మిక చింతనలో భాగంగా వివిధ రకాల యోగసాధనలు చేయడం చూసాం. తాజాగా మంచు దట్టంగా కురుస్తూ తనను కమ్మేస్తున్నా సరే ఏమాత్రం చలించక ధ్యానం చేస్తున్న ఓ యోగి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పుకు పోయిన పర్వతాలపై కనిపించిన ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అదంతా ఏఐ సృష్టేనని కొట్టిపడేశారు.

సన్యాసులు, స్వామీజీలు ఆథ్యాత్మిక చింతనలో భాగంగా వివిధ రకాల యోగసాధనలు చేయడం చూసాం. తాజాగా మంచు దట్టంగా కురుస్తూ తనను కమ్మేస్తున్నా సరే ఏమాత్రం చలించక ధ్యానం చేస్తున్న ఓ యోగి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పుకు పోయిన పర్వతాలపై కనిపించిన ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అదంతా ఏఐ సృష్టేనని కొట్టిపడేశారు. అయితే, అది ఫేక్ కాదని తాజాగా నిర్దారణ అయింది. ఆ యోగి హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాకు చెందిన సత్యేంద్రనాథ్‌గా గుర్తించారు. బంజర్‌కు చెందిన సత్యేంద్రనాథ్ కౌలాంటక్ పీఠం ఆశ్రమంలో 22 ఏళ్లుగా యోగా అభ్యసిస్తున్నారు. ఆయన అనుచరులను ఇష్పుత్ర అని పిలుస్తారు. సత్యేంద్రనాథ్ గురువు ఇష్‌నాథ్ హిమాలయ యోగా సంప్రదాయాన్ని అనుసరించేవారు. ఆయన కౌలాంటక్ పీఠానికి అధిపతి. ఈ పీఠం యోగా, దైవిక అభ్యాసాలకు నిలయం. ఇష్పుత్ర భక్తులు 8కిగాపైగా దేశాలలో విస్తరించి యోగా, భక్తి అభ్యసాలను ప్రోత్సహిస్తూ ఉంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊహకు అందనంత వేగంగా కుంగిపోతున్న అమెరికా నగరాలు !!

కోరిక తీరాలంటే ఆ దేవునికి అరటి గెల సమర్పించాల్సిందే !!