ఊహకు అందనంత వేగంగా కుంగిపోతున్న అమెరికా నగరాలు !!
భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుతూ అమెరికాలోని తూర్పుతీర ప్రాంతాలను భయపెడుతున్న వేళ అమెరికాకు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. న్యూయార్క్, బాల్టిమోర్, నార్‌ఫోక్ వంటి నగరాలు ఊహించిన దానికంటే వేగంగా భూమిలోకి కుంగిపోతున్నాయి. ఉపగ్రహా డేటా, జీపీఎస్ సెన్సార్లను ఉపయోగించి వర్జీనియా టెక్ ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు.
భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుతూ అమెరికాలోని తూర్పుతీర ప్రాంతాలను భయపెడుతున్న వేళ అమెరికాకు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. న్యూయార్క్, బాల్టిమోర్, నార్‌ఫోక్ వంటి నగరాలు ఊహించిన దానికంటే వేగంగా భూమిలోకి కుంగిపోతున్నాయి. ఉపగ్రహా డేటా, జీపీఎస్ సెన్సార్లను ఉపయోగించి వర్జీనియా టెక్ ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. 2007-2020 మధ్య తూర్పుతీర ప్రాంతాలు 1 నుంచి 2 మిల్లీమీటర్లు కుంగిపోయినట్టు తెలిపారు. ఇది చాలా స్వల్పమే అయినప్పటికీ పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా ఈ ముప్పు పెద్దదిగానే భావించాలని పేర్కొన్నారు. దీని వల్ల మౌలిక సదుపాయాలు, కోట్లాదిమంది ప్రజలు ముప్పులో ఉన్నట్టేనని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది. నగరాల కుంగుబాటు కారణంగా 8.97 లక్షల నిర్మాణాలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఉప్పునీరు చొచ్చుకురావడం, భూ క్షీణత వల్ల అడవులు దెబ్బతింటాయని, వన్యప్రాణులపై ప్రభావం పడడంతోపాటు మానవ నిర్మాణాలకూ ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

