నక్షత్రం ఆకారంలో రామాలయం.. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర !!

నక్షత్రం ఆకారంలో రామాలయం.. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర !!

Phani CH

|

Updated on: Feb 26, 2024 | 8:08 PM

భారతదేశంలో రాముడిని కొలవని భక్తుడు ఉండడు.. రామాలయం లేని ఊరు ఉండదు. మారుమూల కుగ్రామంలో కూడా శ్రీరాముడు కొలువై ఉంటాడు. అలా వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తరువాత ఇలాంటి పురాతన ప్రసిద్ధ రామాలయాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి ఆలయానికీ ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అలాగే కర్నూలు జిల్లాలోని పెద్ద తుంబలం గ్రామంలోని రాముడికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది.

భారతదేశంలో రాముడిని కొలవని భక్తుడు ఉండడు.. రామాలయం లేని ఊరు ఉండదు. మారుమూల కుగ్రామంలో కూడా శ్రీరాముడు కొలువై ఉంటాడు. అలా వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తరువాత ఇలాంటి పురాతన ప్రసిద్ధ రామాలయాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి ఆలయానికీ ఏదో ఒక విశిష్టత ఉంటుంది. అలాగే కర్నూలు జిల్లాలోని పెద్ద తుంబలం గ్రామంలోని రాముడికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయం దక్షిణ భారతదేవఃలోనే రెండవ సుప్రసిద్ధ రామాలయంగా చరిత్రకెక్కింది. ఆదోని మంత్రాలయం ప్రధాన రహదారిలోని పెద్దతుంబళం గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం నక్షత్రం ఆకారంలో ఉంటుంది. దీనిని చాళుక్యులు, పాండవులు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 1107 వ సంవత్సరంలో రెండో పులకేశుడు ఈ ఆలయాన్ని నిర్మించారని మరో చరిత్ర కూడా ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి కట్టడం రెండోదిగా పేరు గాంచింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం పురస్కరించుకొని ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి ఆ శాఖ వారు 2016వ సంవత్సరంలో అవార్డు అందించింది. పురావస్తు శాఖ, పర్యాటక శాఖ ఈ ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో

Mukesh Ambani: కొత్త కోడలికి ముకేశ్‌ అంబానీ అదిరిపోయే గిఫ్టులు‌

ఒంటిపై మంచు గడ్డకట్టేస్తున్నా చలించకుండా ధ్యానం !! ఎవరు ఆయన ??

ఊహకు అందనంత వేగంగా కుంగిపోతున్న అమెరికా నగరాలు !!

కోరిక తీరాలంటే ఆ దేవునికి అరటి గెల సమర్పించాల్సిందే !!