ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో

ప్రతి రోజూ ఉదయాన్నే చాలా మంది ఆరోగ్యానికి హాని చేసే కెఫైన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారు. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలను చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు అత్యంత ఆరోగ్యకరమైన ఓ జ్యూస్‌ గురించి మనం తెలుసుకుందాం. ఇది రోజూ పరగడుపునే ఒక్క గ్లాసు తాగితే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్‌పెట్టవచ్చు. అదే బూడిద గుమ్మడికాయ జ్యూస్‌. అవును మీరు విన్నది నిజమే.. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ రసం

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో

|

Updated on: Feb 26, 2024 | 8:07 PM

ప్రతి రోజూ ఉదయాన్నే చాలా మంది ఆరోగ్యానికి హాని చేసే కెఫైన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారు. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలను చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు అత్యంత ఆరోగ్యకరమైన ఓ జ్యూస్‌ గురించి మనం తెలుసుకుందాం. ఇది రోజూ పరగడుపునే ఒక్క గ్లాసు తాగితే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్‌పెట్టవచ్చు. అదే బూడిద గుమ్మడికాయ జ్యూస్‌. అవును మీరు విన్నది నిజమే.. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాకవుతారు. బూడిద గుమ్మడి కాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో విషవ్యర్థాలను బయటకు తొలగించడంలో ఈ జ్యూస్‌ తోడ్పడుతుంది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా మిమ్మల్నీ డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని రసం తాగితే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సమ్మర్ ఫుడ్స్‌లో బూడిద గుమ్మడిని కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆల్కలీన్ ఫుడ్ కావడం వల్ల హానికరమైన రసాయనాల ప్రభావాలను తటస్థీకరిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mukesh Ambani: కొత్త కోడలికి ముకేశ్‌ అంబానీ అదిరిపోయే గిఫ్టులు‌

ఒంటిపై మంచు గడ్డకట్టేస్తున్నా చలించకుండా ధ్యానం !! ఎవరు ఆయన ??

ఊహకు అందనంత వేగంగా కుంగిపోతున్న అమెరికా నగరాలు !!

కోరిక తీరాలంటే ఆ దేవునికి అరటి గెల సమర్పించాల్సిందే !!

Follow us