మాల్దీవుల్లో భారత అనుకూల పార్టీ గెలుపు !! అధ్యక్షుడు ముయిజ్జకు షాక్
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ తగిలింది. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే .. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ PNC ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన ‘మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ MDP తాజాగా ఘనవిజయం సాధించింది. భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు.
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఎదురుదెబ్బ తగిలింది. అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే .. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ PNC ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన ‘మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ MDP తాజాగా ఘనవిజయం సాధించింది. భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు. అజీమ్ గెలుపును మాల్దీవుల మీడియా ‘అఖండ విజయం’గా పేర్కొంది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న ముయిజ్జు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. మేయర్ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంత్ వర్మను చూపిస్తూ.. ఓం రౌత్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్
ఈచిలకా గోరింకకు.. ఎన్ని కష్టాలు..
Hanu Man: మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీం. అయోధ్య రాములోరికి చిరు విరాళం
Prabhas: దుర్గాపరమేశ్వరి ఆలయంలో.. ప్రభాస్
Guntur Kaaram: గుంటూరోడి దెబ్బకి.. లేచిపోయిన బాక్సాఫీస్ టాప్