Donald Trump: ట్రంప్‌కు మరో మొట్టికాయ వేసిన న్యూయార్క్‌ కోర్టు

Donald Trump: ట్రంప్‌కు మరో మొట్టికాయ వేసిన న్యూయార్క్‌ కోర్టు

Phani CH

|

Updated on: Jan 14, 2024 | 6:42 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు న్యూయార్క్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్‌ టైమ్స్‌ న్యూస్‌పేపర్‌, దాని పాత్రికేయులు ముగ్గురికి ట్రంప్‌ దాదాపు 4 లక్షల డాలర్లు చెల్లించాలని స్థానిక జడ్జి రాబర్ట్‌ రీడ్‌ శుక్రవారం ఆదేశించారు. ట్రంప్‌ కుటుంబ సంపద, పన్ను వ్యవహారాల గురించి 2018లో ఈ పత్రిక ప్రచురించిన వార్తా కథనానికి పులిట్జర్‌ బహుమతి వచ్చింది. ఈ వార్త కోసం టైమ్స్‌ విలేకరులు ట్రంప్‌ సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్‌ నుంచి సమాచారం సేకరించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు న్యూయార్క్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్‌ టైమ్స్‌ న్యూస్‌పేపర్‌, దాని పాత్రికేయులు ముగ్గురికి ట్రంప్‌ దాదాపు 4 లక్షల డాలర్లు చెల్లించాలని స్థానిక జడ్జి రాబర్ట్‌ రీడ్‌ శుక్రవారం ఆదేశించారు. ట్రంప్‌ కుటుంబ సంపద, పన్ను వ్యవహారాల గురించి 2018లో ఈ పత్రిక ప్రచురించిన వార్తా కథనానికి పులిట్జర్‌ బహుమతి వచ్చింది. ఈ వార్త కోసం టైమ్స్‌ విలేకరులు ట్రంప్‌ సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్‌ నుంచి సమాచారం సేకరించారు. ట్రంప్‌ తాను స్వశక్తితోనే ఆస్తులు కూడబెట్టానని చెబుతూ ఉంటారు. అది నిజం కాదని, ఆయన తండ్రి ఫ్రెడ్‌ ట్రంప్‌ నుంచి 41.3 కోట్ల డాలర్ల ఆస్తిపాస్తులు సంక్రమించాయని, తండ్రీకుమారులు పన్నుల ఎగవేత ద్వారా బాగా వెనకేసుకున్నారని మేరీ ట్రంప్‌ 2020లో వెలువడిన ఒక పుస్తకంలో బయటపెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాల్దీవుల్లో భారత అనుకూల పార్టీ గెలుపు !! అధ్యక్షుడు ముయిజ్జకు షాక్‌

ప్రశాంత్ వర్మను చూపిస్తూ.. ఓం రౌత్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్‌

ఈచిలకా గోరింకకు.. ఎన్ని కష్టాలు..

Hanu Man: మాట నిలబెట్టుకున్న హనుమాన్‌ టీం. అయోధ్య రాములోరికి చిరు విరాళం

Prabhas: దుర్గాపరమేశ్వరి ఆలయంలో.. ప్రభాస్‌