ప్రశాంత్ వర్మను చూపిస్తూ.. ఓం రౌత్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్‌

ప్రశాంత్ వర్మను చూపిస్తూ.. ఓం రౌత్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్‌

Phani CH

|

Updated on: Jan 14, 2024 | 6:40 PM

హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లు.. ఏ విజువల్ బేస్డ్ సినిమా వచ్చినా ముందు ఓం రౌత్‌పై పడిపోతున్నారు అభిమానులు. అకేషన్ దొరికితే చాలు అటూ ఇటూ వాయించేస్తున్నారు పాపం. ఇదంతా చూసాక అనవసరంగా ఆదిపురుష్ చేసానేమో అని ఔం రౌత్ బాగా ఫీల్ అయ్యుంటాడు. అందులోనూ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌తో ఎందుకురా బాబూ ఇలాంటి సినిమా చేసాను అని బాధ పడి ఉంటాడు.

హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లు.. ఏ విజువల్ బేస్డ్ సినిమా వచ్చినా ముందు ఓం రౌత్‌పై పడిపోతున్నారు అభిమానులు. అకేషన్ దొరికితే చాలు అటూ ఇటూ వాయించేస్తున్నారు పాపం. ఇదంతా చూసాక అనవసరంగా ఆదిపురుష్ చేసానేమో అని ఔం రౌత్ బాగా ఫీల్ అయ్యుంటాడు. అందులోనూ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌తో ఎందుకురా బాబూ ఇలాంటి సినిమా చేసాను అని బాధ పడి ఉంటాడు. ఒకవేళ ఆయన బాధ పడకపోయినా.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రతీ నిమిషం అది గుర్తు చేస్తూనే ఉంటారు. వాళ్లకు యూ ట్యూబ్‌లో అయినా బెస్ట్ విజువల్ షాట్ ఒకటి కనిపిస్తే చాలు.. వెంటనే ఓం రౌత్‌ను ట్యాగ్ చేస్తూ నరకం చూపించేస్తున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా హనుమాన్ సినిమా వచ్చింది. అందులో గ్రాఫిక్స్ అదిరిపోయాయి.. ఔట్ పుట్ మామూలుగా లేదు.. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు ఫిదా అయిపోతున్నారంతా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈచిలకా గోరింకకు.. ఎన్ని కష్టాలు..

Hanu Man: మాట నిలబెట్టుకున్న హనుమాన్‌ టీం. అయోధ్య రాములోరికి చిరు విరాళం

Prabhas: దుర్గాపరమేశ్వరి ఆలయంలో.. ప్రభాస్‌

Guntur Kaaram: గుంటూరోడి దెబ్బకి.. లేచిపోయిన బాక్సాఫీస్‌ టాప్‌

Hanu Man: కలెక్షన్స్‌లో రికార్డ్‌ క్రియేట్ చేస్తున్న హనుమాన్