మమ్మల్ని బెదిరించే అధికారం ఎవరికీ లేదు

భౌగోళికంగా తమది చిన్న దేశమే కావచ్చు. అంతమాత్రాన బెదిరించడం మాత్రం తగదనీ దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదనీ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు అన్నారు. చైనాలో అయిదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో దౌత్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ముయిజ్జు విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు.

మమ్మల్ని బెదిరించే అధికారం ఎవరికీ లేదు

|

Updated on: Jan 15, 2024 | 6:15 PM

భౌగోళికంగా తమది చిన్న దేశమే కావచ్చు. అంతమాత్రాన బెదిరించడం మాత్రం తగదనీ దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదనీ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు అన్నారు. చైనాలో అయిదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో దౌత్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ముయిజ్జు విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మహా సముద్రంలో తమవి చిన్న ద్వీపాలే. కానీ తమకు సముద్రంలో 9 లక్షల చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి ఈఈజడ్‌ ఉందనీ ఇంతపెద్ద వాటా ఉన్న దేశాల్లో తమదీ ఒకటని చెప్పారు. మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందదనీ ఇది దీనిచుట్టూ ఉన్న దేశాలన్నింటిదని అన్నారు. తాము ఎవరి పెరడులోనో లేమనీ ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం తమది అని చెప్పారు. ఇదిలా ఉంటే మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాల్దీవుల్లో భారత అనుకూల పార్టీ గెలుపు !! అధ్యక్షుడు ముయిజ్జకు షాక్‌

ప్రశాంత్ వర్మను చూపిస్తూ.. ఓం రౌత్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్‌

ఈచిలకా గోరింకకు.. ఎన్ని కష్టాలు..

Hanu Man: మాట నిలబెట్టుకున్న హనుమాన్‌ టీం. అయోధ్య రాములోరికి చిరు విరాళం

Prabhas: దుర్గాపరమేశ్వరి ఆలయంలో.. ప్రభాస్‌

 

Follow us