Maldives – India: మనతో మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్న మాల్దీవులు.! చట్టాల ఉల్లంఘన
భారత కోస్ట్ గార్డ్ దళానికి చెందిన సిబ్బంది తమ దేశానికి చెందిన మత్స్యకార బోట్లలో తనిఖీలు చేశారంటూ తాజాగా మాల్దీవుల ప్రభుత్వం మండిపడుతోంది. తమ దేశానికి చెందిన మూడు ఫిషింగ్ బోట్లు తమ ప్రాదేశిక సముద్ర జలాల పరిధిలో వేటాడుతున్నాయంది. అయినా భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ పడవలపై అధికారం చెలాయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది.
భారత కోస్ట్ గార్డ్ దళానికి చెందిన సిబ్బంది తమ దేశానికి చెందిన మత్స్యకార బోట్లలో తనిఖీలు చేశారంటూ తాజాగా మాల్దీవుల ప్రభుత్వం మండిపడుతోంది. తమ దేశానికి చెందిన మూడు ఫిషింగ్ బోట్లు తమ ప్రాదేశిక సముద్ర జలాల పరిధిలో వేటాడుతున్నాయంది. అయినా భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ పడవలపై అధికారం చెలాయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. భారత భద్రతా బలగాలు తమ పడవలపై ఎందుకు కాలుమోపాల్సి వచ్చింది? అంటూ మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ.. భారత ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరింది. అంతేకాదు భారత కోస్ట్ గార్డ్ నౌకల్లోని సిబ్బంది తమ షిఫింగ్ బోట్లలోకి ప్రవేశించారనీ ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అంటూ మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది.. కాగా, మాల్దీవుల ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. టూరిజం అంశంలో భారత్, మాల్దీవుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ కు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ట్వీట్ చేయడం, మాల్దీవుల నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంతో వ్యవహారం కాస్తా వివాదం రూపుదాల్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..