Chile Forest: చిలీలో కార్చిచ్చుకు 46 మంది బలి.! బలమైన గాలులతో వేగంగా వ్యాప్తి.

Chile Forest: చిలీలో కార్చిచ్చుకు 46 మంది బలి.! బలమైన గాలులతో వేగంగా వ్యాప్తి.

Anil kumar poka

|

Updated on: Feb 05, 2024 | 4:25 PM

చిలీ దేశంలో చెలరేగిన కార్చిచ్చు ఆరడం లేదు. అటవీ కార్చిచ్చుకి ఇప్పటివరకు కనీసం 46 మంది మృతిచెందినట్లు వేలాది మంది గాయపడినట్లు అధ్యక్షుడు బోరిక్‌ గాబ్రియెల్‌ తాజాగా ప్రకటించారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు.

చిలీ దేశంలో చెలరేగిన కార్చిచ్చు ఆరడం లేదు. అటవీ కార్చిచ్చుకి ఇప్పటివరకు కనీసం 46 మంది మృతిచెందినట్లు వేలాది మంది గాయపడినట్లు అధ్యక్షుడు బోరిక్‌ గాబ్రియెల్‌ తాజాగా ప్రకటించారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వాల్పరైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్‌ విజ్ఞప్తి చేశారు. మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్పరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos