KIM: కిమ్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలను భయపెట్టేలా అణుదాడి చేస్తామంటూ..(వీడియో)
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశం అని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, కొత్తగా అణు చట్టం కూడా తీసుకువచ్చారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశం అని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, కొత్తగా అణు చట్టం కూడా తీసుకువచ్చారు. ఈ చట్టం ఇక ఎంతమాత్రం వెనక్కి తీసుకోలేనిదని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా తన రక్షణ కోసం ఏ దేశంపైనైనా మొదట దాడి చేసే హక్కు ఉత్తర కొరియాకు ఉందని ఆ చట్టంలో తెలిపారు. అణ్వస్త్ర రహిత దేశాలపై మొదట దాడిచేయబోమని గతంలో కిమ్ చెప్పారు. ఇప్పుడా సిద్ధాంతాన్ని తొలగించి, రక్షణ కోసం తామే మొదట దాడి చేసేలా చట్టంలో తెలిపారు.2017 తర్వాత తొలిసారిగా అణు పరీక్షలను పునఃప్రారంభించేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ప్రపంచ నాయకులతో జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం తర్వాత కూడా కిమ్‌ని ఆయుధాల అభివృద్ధిని వదులుకోమని ఒప్పించడంలో ప్రపంచం విఫలమైంది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను నిరంతరం పరీక్షిస్తోంది. దాని కొత్త ప్రకటన ప్రపంచ దేశాల్లో ఆందోళనలను పెంచింది. ఇప్పుడు అతను తన సైనికులకు దేశాన్ని రక్షించడానికి ఎప్పుడైనా అణు దాడులు చేసే చట్టపరమైన అధికారాన్ని కూడా ఇచ్చారు.కిమ్ తన ప్రసంగంలో అణ్వాయుధాల విధానాన్ని చట్టబద్ధం చేయడం వెనుక అత్యంత ప్రాముఖ్యతను వివరించారు..తమ అణ్వాయుధాలపై ఎటువంటి బేరసారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీని కోసం 100 ఏళ్ల నిషేధాన్ని ఎదుర్కోవలసి వచ్చినా, తమ అణ్వాయుధాలను అప్పగించబోమని కిమ్ స్పంచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..