Viral Video: అమెరికాలో పడగ విప్పిన విద్వేషం.. మీ దేశానికి వెళ్లిపో.. భారతీయ అమెరికన్‌ చట్టసభ్యురాలికి బెదిరింపు..

Viral Video: అమెరికాలో పడగ విప్పిన విద్వేషం.. మీ దేశానికి వెళ్లిపో.. భారతీయ అమెరికన్‌ చట్టసభ్యురాలికి బెదిరింపు..

Anil kumar poka

|

Updated on: Sep 15, 2022 | 9:48 AM

అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారిపై జాత్యహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయులు కనిపిస్తే చాలు, విద్వేషాన్ని ప్రదర్శిస్తూ దారుణంగా అవమానిస్తున్నారు.


అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారిపై జాత్యహంకార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయులు కనిపిస్తే చాలు, విద్వేషాన్ని ప్రదర్శిస్తూ దారుణంగా అవమానిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఆగస్టు 26న టెక్సాస్‌లో నలుగురు మహిళలకు, సెప్టెంబర్‌ 1న కాలిఫోర్నియాలో ఒకరికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా, అమెరికా చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్‌కు ట్విట్టర్ వేదికగా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అమెరికాను విడిచి వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని బెదిరిస్తూ ఓ వ్యక్తి ఆడియో క్లిప్‌లను షేర్ చేశాడు. వీటిని బయటపెట్టిన ప్రమీల.. సాధారణంగా రాజకీయ నాయకులు తమ దుర్బలత్వాన్ని ప్రదర్శించరని కానీ, హింసను అంగీకరించలేం కాబట్టే తాను ఈ ఆడియో క్లిప్‌లను బయటపెడుతున్నట్టు చెబుతూ తనకొచ్చిన ఐదు వాయిస్ క్లిప్పింగ్‌లను షేర్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు ఆధారంగా నిలిచే జాత్యహంకారం, లింగ వివక్షను సహించేది లేదని జయపాల్ తెలిపారు. ప్రమీల మొట్టమొదటి భారతీయ అమెరికన్ చట్టసభ్యురాలు. చెన్నైకి చెందిన ఆమె డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభలో సియాటెల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఒకసారి ఆమె ఇంటి బయట ఓ వ్యక్తి తుపాకితో పోలీసులకు పట్టుబడ్డాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 15, 2022 09:48 AM