Heteroparental twins: ఈ కవలలకు తండ్రులు వేరు.! నోరెళ్ళబెట్టిన డాక్టర్లు..! అసలు ట్విస్ట్ ఏంటంటే..
బ్రెజిల్‌లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. అయితే ఇందులో చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే...
బ్రెజిల్‌లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. అయితే ఇందులో చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! పిల్లలకు 8 నెలలు వచ్చాక అసలు వారి తండ్రి ఎవరా అని ఆమెకు అనుమానం వచ్చింది. వారి తండ్రిగా తాను భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్‌ఏతో మాత్రమే సరిపోయిందట.దాంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపు ఆలోచించిన మీదట, తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. డీఎన్‌ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. శాస్త్రీయంగా దీన్ని హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ బహుళ పిండోత్పత్తిగా పిలుస్తారట. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందట. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు ఉమ్మనీటి సంచిలో పెరుగుతాయట. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

