Israeli – Gaza: ఇజ్రాయెల్ అనుమానం నిజమైంది.. ఆ ఆస్పత్రి నిండా ఆయుధాలే.!

గాజాలోని ఆల్‌-షిఫా ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దళాలు.. అక్కడ హమాస్‌ ముష్కరుల కోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఆల్‌-షిఫా ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐ భవనంలో పెద్ద ఎత్తున ఆయుధాలు బయటపడ్డాయి. అందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తమ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆ వీడియోలో ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐ యూనిట్‌లో దాచి ఉంచిన హమాస్‌ ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం..

Israeli - Gaza: ఇజ్రాయెల్ అనుమానం నిజమైంది.. ఆ ఆస్పత్రి నిండా ఆయుధాలే.!

|

Updated on: Nov 16, 2023 | 9:09 PM

గాజాలోని ఆల్‌-షిఫా ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దళాలు.. అక్కడ హమాస్‌ ముష్కరుల కోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఆల్‌-షిఫా ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐ భవనంలో పెద్ద ఎత్తున ఆయుధాలు బయటపడ్డాయి. అందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తమ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆ వీడియోలో ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐ యూనిట్‌లో దాచి ఉంచిన హమాస్‌ ఆయుధాలను ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి జొనాథన్‌ కాన్రికస్‌ స్వయంగా చూపించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గాజాలోని ఆస్పత్రులను హమాస్‌ తమ నేర కార్యకలాపాలకు వినియోగించుకుంటోందని, ఇందులో ఎలాంటి సందేహం లేదు అని జొనాథన్‌ అందులో పేర్కొన్నారు. ఎంఆర్‌ఐ గదిలో హమాస్‌కు చెందిన పలు బ్యాగులు కన్పించాయి. అందులో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. ఏకే-47, గ్రనేడ్ల వంటి వాటిని అక్కడ భద్రపర్చినట్లుగా తెలుస్తోంది.

అల్-షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు బయటపడగానే ఇజ్రాయెల్‌ తమ ఆపరేషన్‌ను మరింత తీవ్రంగా చేసింది. ఈ ఆస్పత్రి కింద హమాస్‌ ప్రధాన కమాండ్‌ సెంటర్‌ ఉందని చెబుతున్న ఇజ్రాయెల్‌.. ఆ టన్నెల్‌ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఇక్కడ భారీగా సోదాలు నిర్వహిస్తోంది. నిఘా వర్గాల సాయంతో టన్నెల్‌ ప్రవేశ మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాగా.. ఈ ఆస్పత్రిని కూల్చేయాలని ఇజ్రాయెల్‌ భావిస్తున్నట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అల్-షిఫా చుట్టపక్కల బుల్డోజర్లను మోహరించినట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్‌ పోరుతో ఆస్పత్రి వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో నీరు, విద్యుత్‌, ఔషధాల సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల పరిస్థితి దారుణంగా ఉంది. అయితే, ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఔషధాలను తాము సరఫరా చేస్తున్నామని ఐడీఎఫ్‌ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023