Hamas – Israel: ఇజ్రాయెల్‌లో యుద్ధానికి హమాస్‌కు అంత డబ్బెక్కడది.? హమాస్ శక్తి ఏమిటి?
హమాస్-జ్రాయెల్ మధ్య యుద్ధం నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. వేల రాకెట్లతో విరుచుకుపడిన హమాస్ మిలిటెంట్లకు తనదైనశైలిలో దీటుగా సమాధానం చెబుతోంది ఇజ్రాయెల్ సైన్యం. హమాస్‌ను మట్టుపెట్టేవరకూ తగ్గేదేలేదంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో గాజాను చుట్టుముట్టాయి. భూతల దాడులతో గాజాను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి.
హమాస్-జ్రాయెల్ మధ్య యుద్ధం నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. వేల రాకెట్లతో విరుచుకుపడిన హమాస్ మిలిటెంట్లకు తనదైనశైలిలో దీటుగా సమాధానం చెబుతోంది ఇజ్రాయెల్ సైన్యం. హమాస్‌ను మట్టుపెట్టేవరకూ తగ్గేదేలేదంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో గాజాను చుట్టుముట్టాయి. భూతల దాడులతో గాజాను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. బుధవారం గాజాలో అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్–షిఫాలోకి చొరబడ్డాయి ఇజ్రాయెల్ సేనలు. అది ఆస్పత్రి కాదని అతిపెద్ద ఆయుధ బాండాగారమని రుజువు చేసింది. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కానీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ఇస్లామిక్ సంస్థ అయిన హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? హమాస్ వెనుక ఉండి నడిపిస్తున్న అజ్ఞాత శక్తి ఏమిటి? అనే ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది. రెండేళ్ళ కిందట ఇజ్రాయెల్‌తో 11 రోజులపాటు యుద్ధం చేసిన హమాస్ అప్పట్లో 4 వేల రాకెట్లను ప్రయోగించింది. కానీ, ఈ ఏడాది అక్టోబరు 7 నాటి దాడులలో ఒక్క రోజులోనే కొన్నివేల రాకెట్లను వినియోగించింది. దీనిని బట్టి హమాస్ శక్తి ఏమిటో అర్ధమవుతోంది. అయితే హమాస్ సైనిక వ్యయం, గాజా స్ట్రిప్‌లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ప్రతినెలా అయ్యే 30 మిలియన్ డాలర్ల ఖర్చు ఇదంతా ఎక్కడినుంచి వస్తోంది? అంతేకాదు, యుద్ధంలో తమ కుటుంబాలను కోల్పోయినవారికి కూడా హమాస్ ఆర్ధికసాయం చేస్తోంది. ఇదంతా ఎలా జరగుతోంది?
గాజా ప్రభుత్వ వార్షిక బడ్జెట్ 700 మిలియన్ డాలర్ల పైమాటే. వీటిల్లో 260 మిలియన్ల డాలర్ల ప్రస్తుత వ్యయం కూడా కలిసి ఉందని రాయ్‌టర్స్ వార్తా సంస్థ తెలిపింది. గాజాస్ట్రిప్‌లోని ప్రభుత్వంతోపాటు, హమాస్‌కు కూడా అనేక మార్గాలలో ఆర్థిక సాయం అందుతోంది. ఇతర ప్రభుత్వాల నుంచి కూడా వీరికి కొంత ఆర్థికసాయం అందుతుంది. పౌరుల నుంచి, దాతృత్వ సంస్థల నుంచి సైతం డబ్బులు అందుతాయి. క్రిప్టో కరెన్సీ ద్వారా కొంత మొత్తాన్ని సంపాదిస్తారు. అలాగే వివిధ దేశాలలో పెట్టుబడుల ద్వారానూ డబ్బు సంపాదిస్తారు. ఇరాన్, ఖతార్, కువైట్, టర్కీ, సౌదీ అరేబియా, అల్జీరియా, సుడాన్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు హమాస్‌కు రాజకీయ, ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇందులో ఖతార్ పాత్ర చాలా కీలకమైనది. ఖతార్ దేశస్థుల నుంచి 30 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రతినెలా హమాస్ పొందుతోందని ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నెషనల్ అండ్ స్ట్రాటజిక్ ఎఫైర్స్ (IRIS) పేర్కొంది. ఈ సాయాన్ని గాజాస్ట్రిప్‌లోని ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు వినియోగిస్తున్నారని తెలిపారు. హమాస్‌కు అతిపెద్ద మద్దతుదారు ఖతార్. హమాస్ రాజకీయ కార్యాలయం కూడా ఖతార్ రాజధానిలోనే ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.