Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel: హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను.. మమ్మల్నీ ఎవరూ ఆపలేరు.: ఇజ్రాయెల్ పీఎం.

Israel: హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను.. మమ్మల్నీ ఎవరూ ఆపలేరు.: ఇజ్రాయెల్ పీఎం.

Anil kumar poka

|

Updated on: Dec 01, 2023 | 7:14 PM

హమాస్‌ - ఇజ్రాయెల్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ... తమ పోరాటం ఆగబోదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని, తమను ఎవరూ ఆపలేరని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం పునరుద్ఘాటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో శుక్రవారం జెరూసలేంలో సమావేశమైన నెతన్యాహు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

హమాస్‌ – ఇజ్రాయెల్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ… తమ పోరాటం ఆగబోదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని, తమను ఎవరూ ఆపలేరని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం పునరుద్ఘాటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో శుక్రవారం జెరూసలేంలో సమావేశమైన నెతన్యాహు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హమాస్‌ను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని, తాను కూడా ప్రమాణం చేశానని, తమ లక్ష్యం నెరవేరేవరకూ తమను ఏదీ ఆపబోదు అని నెతన్యాహు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రిపోర్ట్ పేర్కొంది.

హమాస్ చెరలో మిగిలిన బందీలు అందరినీ విడిపించే ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గాజా స్ట్రిప్‌లో కీలకమైన మానవతా సాయాన్ని వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతపై కూడా చర్చించినట్టు వివరించింది. సైనిక కార్యకలాపాలకు ముందు మానవతా, పౌర రక్షణ విషయంలో చర్యలను నిర్ధారించాలని నెతన్యాహును బ్లింకెన్ కోరినట్టు తెలిపింది. వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై హింసకు పాల్పడుతున్న సెటిలర్ అతివాదులను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధానిని కోరారని పేర్కొంది. పాలస్తీనాలో శాంతి, స్వేచ్చ, భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని బ్లింకెన్ తెలిపినట్టు ప్రకటనలో స్పష్టం చేసింది. జెరూసలేంలో ఇద్దరు వ్యక్తులను హమాస్ ఉగ్రవాదులు కాల్చిచంపిన అనంతరం వీరిద్దరి భేటీ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఎనిమిది మంది అమాయక పౌరులు గాయాలపాలయ్యారని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.