టూత్‌ పేస్ట్‌లో విషం కలిపి.. హతమార్చేసే చరిత్ర ఇజ్రాయెల్‌ నిఘా సంస్థది

హమాస్‌ అగ్రనేత హనియా హత్యతో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ పేరు మరోసారి వినిపిస్తోంది. బస చేసిన హోటల్‌లో ముందే బాంబు పెట్టి హనియాను హతమార్చిన తీరు చూస్తే గతంలో మొస్సాద్ చేపట్టిన ఆపరేషన్‌ ‘ఏజెంట్‌ స్యాడ్‌నెస్‌’ గుర్తొస్తోంది. అదేంటి? దాంట్లో ఎవర్ని లక్ష్యంగా చేసుకున్నారు? 46 ఏళ్లకు ముందు .. ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడుతున్న సంస్థల్లో ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఫర్‌ ది లిబరేషన్‌ ఆఫ్‌ పాలస్తీనా’ ఒకటి.

టూత్‌ పేస్ట్‌లో విషం కలిపి.. హతమార్చేసే చరిత్ర ఇజ్రాయెల్‌ నిఘా సంస్థది

|

Updated on: Aug 08, 2024 | 1:26 PM

హమాస్‌ అగ్రనేత హనియా హత్యతో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ పేరు మరోసారి వినిపిస్తోంది. బస చేసిన హోటల్‌లో ముందే బాంబు పెట్టి హనియాను హతమార్చిన తీరు చూస్తే గతంలో మొస్సాద్ చేపట్టిన ఆపరేషన్‌ ‘ఏజెంట్‌ స్యాడ్‌నెస్‌’ గుర్తొస్తోంది. అదేంటి? దాంట్లో ఎవర్ని లక్ష్యంగా చేసుకున్నారు? 46 ఏళ్లకు ముందు .. ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడుతున్న సంస్థల్లో ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఫర్‌ ది లిబరేషన్‌ ఆఫ్‌ పాలస్తీనా’ ఒకటి. ఈ సంస్థ చేసిన అనేక దాడుల్లో ఒకప్పటి దాని చీఫ్‌ వాడీ హద్దాద్‌ది కీలక పాత్ర. ఇజ్రాయెల్‌ దీన్ని ‘ఆపరేషన్‌ థండర్‌బోల్ట్‌’తో తిప్పికొట్టింది. ఈ మిషన్‌కు లెఫ్టినెంట్‌ కర్నల్‌ యొనాతన్‌ నెతన్యాహు నేతృత్వం వహించారు. ఆయన ప్రస్తుత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు స్వయానా సోదరుడు. ఆపరేషన్‌ విజయవంతమైంది. కానీ, యొనాతన్‌ మృతిచెందారు.యొనాతన్‌ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని మొస్సాద్‌ నిర్ణయించింది. హైజాక్‌కు సూత్రధారి అయిన హద్దాద్‌ను అంతమొందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అప్పటికే హద్దాద్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు పెరిగింది. దీంతో అతణ్ని హతమార్చే కార్యక్రమాన్ని ఎలాంటి హడావుడి లేకుండా కానిచ్చేయాలని నిర్ణయించింది. అందుకోసం హద్దాద్‌ ఇల్లు, కార్యాలయంలోకి వెళ్లే ఓ వ్యక్తిని ఉచ్చులోకి లాగింది. అతనికి ‘ఏజెంట్‌ స్యాడ్‌నెస్‌’ అని పేరు పెట్టింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గొప్ప మనసు చాటుకున్న “మల్లు అర్జున్‌” వయనాడ్ బాధితుల కోసం విరాళం

మహిళ తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Palvancha: పాల్వంచలో ఎత్తైన టవర్లను ఎలా కూల్చేశారో చూడండి

ఈ అందాన్ని చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాలా

Indian Railways: ఆన్ డ్యూటీ అయినా సరే టికెట్ ఉండి తీరాల్సిందే

Follow us