గొప్ప మనసు చాటుకున్న మల్లు అర్జున్‌'' వయనాడ్ బాధితుల కోసం విరాళం

గొప్ప మనసు చాటుకున్న “మల్లు అర్జున్‌” వయనాడ్ బాధితుల కోసం విరాళం

Phani CH

|

Updated on: Aug 08, 2024 | 1:24 PM

నటుడు అల్లు అర్జున్‌ తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ఆయన స్పందించారు. అక్కడి ప్రభుత్వానికి తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోషల్‌ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. వయనాడ్‌ ఘటన తనని కలచి వేసిందన్నారు.

నటుడు అల్లు అర్జున్‌ తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ఆయన స్పందించారు. అక్కడి ప్రభుత్వానికి తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోషల్‌ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. వయనాడ్‌ ఘటన తనని కలచి వేసిందన్నారు. కేరళ వాసులు తనని ఎంతో అభిమానించారని చెప్పారు. అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అక్కడి ప్రేక్షకులు ఆయన్ని ప్రేమగా మల్లు అర్జున్‌ అని పిలుస్తుంటారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎంతోమంది మృతిచెందడం యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార – విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ ఘటనపై మలయాళ చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా వేడుకలు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్రబృందాలు తెలిపాయి. కమల్‌హాసన్‌ లాంటి మరికొందరు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నటుడు మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళ తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Palvancha: పాల్వంచలో ఎత్తైన టవర్లను ఎలా కూల్చేశారో చూడండి

ఈ అందాన్ని చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాలా

Indian Railways: ఆన్ డ్యూటీ అయినా సరే టికెట్ ఉండి తీరాల్సిందే

ఇండిగో కీలక నిర్ణయం.. దేశీయ మార్గాల్లోనూ బిజినెస్‌ క్లాస్‌