Bangladesh: దేశం వదిలి పారిపోయిన ప్రధాని.. అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది.?

Bangladesh: దేశం వదిలి పారిపోయిన ప్రధాని.. అసలు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది.?

Anil kumar poka

|

Updated on: Aug 08, 2024 | 3:23 PM

బంగ్లాదేశ్‌లో పోలీసులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య గత కొన్నాళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్‌ హసీనా తీసుకున్న నిర్ణయం చిచ్చురేపింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చెలరేగాయి ఆ కోటాను రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి.

ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా పేరు పొందిన మహిళ..
నిన్న మొన్నటి వరకు తిరుగులేని అధికారం చెలాయించిన ప్రధాని..
ఇప్పుడు ఉన్నపాటున దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది.
ప్రధాని పదవికి రాజీనామా చెయ్యడమే కాదు.. దొడ్డి దారిన మరో దేశానికి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్మీ ఇచ్చిన 45 నిమిషాల వ్యవధిలో పెట్టె బేడా సర్దుకొని ఫ్యామెలీ ఫ్యామెలీ అంతా ఉన్న ఫణంగా ఆర్మీ విమానం సీ-30లో దేశం విడిచి వెళ్లాల్సిన స్థితి.. అసలు ఎందుకిలా జరిగింది.? బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది.

బంగ్లాదేశ్‌లో పోలీసులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య గత కొన్నాళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో బంగ్లా అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని షేక్‌ హసీనా తీసుకున్న నిర్ణయం చిచ్చురేపింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశమంతటా ఆందోళనలు చెలరేగాయి ఆ కోటాను రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. చివరకు అది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు సుమారు 300 మందికిపైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఆదివారం నాటి ఘర్షణల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోవడంతో.. ప్రస్తుతం పాలన ఆర్మీ చీఫ్ చేతుల్లోకి వెళ్లింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 08, 2024 03:22 PM