అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు వీడియో
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో అమెరికాలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వచ్చే ఏడాది నుంచి కాలిఫోర్నియా దీపావళిని అధికారిక సెలవుగా ప్రకటించింది. వేల మంది ప్రవాస భారతీయులు, నాన్-ఇండియన్లు ఈ అతి పెద్ద వేడుకల్లో పాల్గొని సంస్కృతి వైవిధ్యాన్ని చాటారు.
అమెరికాలోని అలమేడ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేలాది మంది ప్రవాస భారతీయులు, స్థానికేతరులు ఈ ఉత్సవాల్లో పాల్గొని సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పారు. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా కౌన్సిల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి హాజరయ్యారు. కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ రాబ్ బాంటా, FUSD బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రేణు నైర్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియా రాష్ట్రం వచ్చే సంవత్సరం నుండి దీపావళిని అధికారిక సెలవు దినంగా ప్రకటించిందని, దీనికి సంబంధించిన ఏబీ 268 బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిందని వెల్లడించారు. పెన్సిల్వేనియా, కనెక్టికట్‌ల తర్వాత దీపావళిని అధికారిక సెలవుగా ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. రావణ దహనం, బాణసంచా, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరిన్ని వీడియోల కోసం :
నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్ వీడియో
ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా
డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
