బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లా బహదూర్‌గంజ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మజ్లిస్ అభ్యర్థి తౌసీఫ్ ఆలం నామినేషన్ సందర్భంగా బిర్యానీ పంపిణీ జరిగింది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు హైదరాబాద్ బిర్యానీ పొట్లాల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. నిర్వాహకులు వారిని నియంత్రించలేకపోయారు. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.