ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో కోపోద్రిక్తుడైన అల్లుడు ముజాహిద్ బేగ్, అత్తవారింటికి వెళ్లి గ్యాస్ సిలిండర్ పైపు లీక్ చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా కాలిపోయి ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.