Trump Biopic: ట్రంప్‌ బయోపిక్‌లో మొదటి భార్యపై లైంగికదాడి సీన్‌

Trump Biopic: ట్రంప్‌ బయోపిక్‌లో మొదటి భార్యపై లైంగికదాడి సీన్‌

Phani CH

|

Updated on: May 25, 2024 | 11:26 AM

ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్స్‌ ఫెస్టివల్‌లో ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయోపిక్‌.. ది అప్రెంటిస్‌ అందుకు కారణం. సినిమా అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కినప్పటికీ.. ట్రంప్‌ పర్సనల్‌ లైఫ్‌లోని కొన్ని షాకింగ్‌ విషయాలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. తన దివంగత మొదటి భార్య ఇవానా పై ట్రంప్‌ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్‌ ఉంది.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ ఫిల్స్‌ ఫెస్టివల్‌లో ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయోపిక్‌.. ది అప్రెంటిస్‌ అందుకు కారణం. సినిమా అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కినప్పటికీ.. ట్రంప్‌ పర్సనల్‌ లైఫ్‌లోని కొన్ని షాకింగ్‌ విషయాలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. తన దివంగత మొదటి భార్య ఇవానా పై ట్రంప్‌ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్‌ ఉంది. ఆ సీన్‌ కేన్స్‌ ఆడియెన్స్‌ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. ఈ సినిమా .. బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్‌ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాలో… కేవలం 70, 80 దశకాల్లో ట్రంప్‌ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్‌ టవర్‌ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు. మరోవైపు తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్‌కు.. ఈ చిత్రం పెద్ద షాకే ఇచ్చింది. దీంతో దావా వేసేందుకు సిద్ధమయ్యారు ట్రంప్‌. ఈ చిత్రం పరమ చెత్తగా ఉందనీ కల్పిత కథనాలతో సంచలనం కోసమే తీశారని చిత్రంపై దావా వేయబోతున్నుట్లు ట్రంప్‌ టీం అధికారిక ప్రకటక విడుదల చేసింది. అయితే ట్రంప్‌ దావా బెదిరింపులపై చిత్ర డైరెక్టర్ అలీ‌ అబ్బాసీ స్పందించారు. ట్రంప్‌ టీమ్‌ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలని.. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అన్నారు. అంతేకాదు ట్రంప్‌ సైతం ఈ చిత్రం చూస్తే ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగదని అభిప్రాయపడ్డారు. ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారే కానీ ఆయన ఎలా సక్సెస్‌ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరనీ.. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుందని అన్నారు. ది అప్రెంటిస్ చిత్రం 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మే 20న ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

apkతో సైబర్‌ నేరగాళ్ల మోసం.. ఇంతకీ ఏంటీ మోసం ?? ఎలా దోచేస్తున్నారు ??

ఆ పురుగులొచ్చాయంటే వర్షాలకు కరవు లేనట్టే

అందుకే మరి… ఏనుగును తక్కువ అంచనా వేయకూడదు

పెరగనున్న టోల్ ఛార్జీలు.. వాహనదారుల జేబుకు చిల్లు