Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే మరి... ఏనుగును తక్కువ అంచనా వేయకూడదు

అందుకే మరి… ఏనుగును తక్కువ అంచనా వేయకూడదు

Phani CH
|

Updated on: May 25, 2024 | 11:06 AM

Share

ఏనుగు ఎంతో బలమైనదే కాదు తెలివైన జంతువు కూడా. ఏనుగు మంచి స్నేహశీలికూడా. అయితే దానికి తిక్కరేగిందంటే మాత్రం అవతలి వాళ్లకు చుక్కలు చూపిస్తుంది. ఇక దానికి ఆకలేసిందంటే.. ఎంత కష్టమైనా ఆహారాన్ని సాధించుకుంటుంది. అప్పుడప్పుడూ ఏనుగులు చెట్ల లేత చిగుళ్లు తింటుంటాయి. అలా అడవిలోని ఓ ఏనుగు ఆరోజు లేత చిగుళ్ళు తినాలనుకుంది. చెట్టు చూస్తే అంత ఎత్తుంది. ఏనుగుకి అందడంలేదు.

ఏనుగు ఎంతో బలమైనదే కాదు తెలివైన జంతువు కూడా. ఏనుగు మంచి స్నేహశీలికూడా. అయితే దానికి తిక్కరేగిందంటే మాత్రం అవతలి వాళ్లకు చుక్కలు చూపిస్తుంది. ఇక దానికి ఆకలేసిందంటే.. ఎంత కష్టమైనా ఆహారాన్ని సాధించుకుంటుంది. అప్పుడప్పుడూ ఏనుగులు చెట్ల లేత చిగుళ్లు తింటుంటాయి. అలా అడవిలోని ఓ ఏనుగు ఆరోజు లేత చిగుళ్ళు తినాలనుకుంది. చెట్టు చూస్తే అంత ఎత్తుంది. ఏనుగుకి అందడంలేదు. దాంతో ఆ ఏనుగు అమాంతం అంత పెద్దచెట్టునూ నేలకూల్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకులు తినాలనుకుని చెట్టుదగ్గరకు వెళ్లింది ఏనుగు. దానికి కొమ్మలు, ఆకులు చాలా ఎత్తుగా ఉన్నాయి. అయితేనేం? ఏనుగుకి బలం ఎక్కువ కదా… మొదట ఓ కొమ్మను విరగ్గొడదామని ప్రయత్నించింది. వర్కవుట్‌ కాలేదు. ఇక లాభం లేదనుకొని దాని తొండంతో చెట్టును కూల్చి పడేసింది. తర్వాత ఏనుగు మెల్లగా కూలిపడిన చెట్టు దగ్గరికి వెళ్లింది. దానికి కావాల్సిన కొమ్మలను తొండంతో తెంచుకుంది. దక్షిణాఫ్రికాలోని మలమలగమే రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన ఈ ఘటనను కొందరు వీడియో తీసి ఇన్ స్టాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోను 3 లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘వామ్మో అంత పెద్ద చెట్టును ఎంత సింపుల్ గా పడేసింది. ఏనుగుల బలమేంటో ఈ వీడియో చూస్తే తెలిసిపోతోంది’ అని కొందరు, అంత పెద్ద చెట్టు పెరగాలంటే కొన్ని ఏళ్లు పడుతుంది. ఏనుగేమో సింపుల్ గా కూల్చేసింది. ఇలాగైతే అడవి నాశనమైపోదా..అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మరొకరు మాత్రం ఏనుగులకు లేత ఆకులు తినాలని అనిపించినప్పుడు ఇలా చెట్లను కూల్చేస్తుంటాయి. ఆ ఆకులను ఇతర జంతువులు కూడా తింటాయి. అడవుల్లో ఇది కామనే.. అని కామెంట్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరగనున్న టోల్ ఛార్జీలు.. వాహనదారుల జేబుకు చిల్లు