ఊరి చివర గేదెలు మేపేందుకు వెళ్లారు.. అక్కడ కనిపించింది చూసి షాక్

జీవాలను మేపేందుకు స్థానికులు ఊరు చివర కొండల వద్దకు వెళ్లారు. అక్కడ చిరుత పులి పిల్ల కనిపించడంతో కంగుతిన్నారు. నంద్యాల జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. డోన్ మండలం చనుగొండ్ల దగ్గర చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి పక్కనే ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పిల్ల కనిపించడంతో.. స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుందనీ, ఏక్షణంలో ఎవరిపై దాడి చేస్తుందో అని భయపడుతున్నారు.

ఊరి చివర గేదెలు మేపేందుకు వెళ్లారు.. అక్కడ కనిపించింది చూసి షాక్

|

Updated on: May 24, 2024 | 9:30 PM

జీవాలను మేపేందుకు స్థానికులు ఊరు చివర కొండల వద్దకు వెళ్లారు. అక్కడ చిరుత పులి పిల్ల కనిపించడంతో కంగుతిన్నారు. నంద్యాల జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. డోన్ మండలం చనుగొండ్ల దగ్గర చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి పక్కనే ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పిల్ల కనిపించడంతో.. స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుందనీ, ఏక్షణంలో ఎవరిపై దాడి చేస్తుందో అని భయపడుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు.. అటు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా, కొండల్లో కనిపించిన ఆ బుజ్జి చిరుత పిల్లను కొందరు వీడియోలు తీశారు. ప్రస్తుతం బుజ్జి చిరుత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చిరుత కూన స్థానికుల్లో గుబులు రేపింది. గతంలో చిరుత వెంకటాపురం సమీపంలోని కొండ గుహల్లో కనిపించిందని.. అక్కడ రాళ్ల మధ్యలో ఉంటూ అటు వైపుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కొండ ప్రాంతానికి ఆనుకొని గ్రామంలో ఇళ్లు ఉండటంతో చనుగొండ్ల గ్రామ ప్రజలు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. స్థానికులు చిరుత పిల్ల సంచారంపై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీట్‌రూట్‌తో ఇలా చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం

భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో కోటీశ్వరురాలైన భార్య.. ఎలాగంటే ??

కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరివాడినయ్యా !! అసలు కథ ఏంటంటే ??

ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??

ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో రిటైర్డ్ సైనిక శునకం ప్రయాణం

 

Follow us