ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??

అవసాన దశలో అండగా ఉంటారని పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని, తమ పిల్లలే ప్రపంచంగా బ్రతికే తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. కన్నబిడ్డలచేతే నెట్టివేయబడి అనాధల్లా రోడ్డుపాలవుతున్నారు చాలామంది. అలా కుమార్తెతో నెట్టివేయబడిన తల్లి కోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఆతల్లి గోడు విన్న కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆ తల్లి బ్రతికి ఉన్నంతవరకూ కుమార్తె ఆమెకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది.

ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??

|

Updated on: May 24, 2024 | 9:23 PM

అవసాన దశలో అండగా ఉంటారని పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని, తమ పిల్లలే ప్రపంచంగా బ్రతికే తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. కన్నబిడ్డలచేతే నెట్టివేయబడి అనాధల్లా రోడ్డుపాలవుతున్నారు చాలామంది. అలా కుమార్తెతో నెట్టివేయబడిన తల్లి కోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఆతల్లి గోడు విన్న కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆ తల్లి బ్రతికి ఉన్నంతవరకూ కుమార్తె ఆమెకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు తన కూతురు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకున్నది ఒక్కగానొక్క కూతురని, భర్త పోయాక కూతురుతోనే ఉంటున్నానని తెలిపింది. భర్త నుంచి తనకు అందింన సొమ్ము, ఇంటిని కూతురు తీసేసుకుని, ఆపై ఆమె ఇంట్లోనే తనకు చోటిచ్చిందని వివరించింది. అయితే, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూతురు తనను కొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టిందని, దీంతో కోర్టును ఆశ్రయించినట్లు వృద్ధురాలు పేర్కొంది. ఈమేరకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఇండోర్ అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్.. ఆ వృద్ధురాలికి నెలనెలా రూ. 3 వేలు పంపాలని ఆమె కూతురును ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. చీరల దుకాణం నడుపుతూ నెలకు సుమారు రూ.22 వేల వరకు సంపాదిస్తున్న కూతురు.. తన తల్లి పోషణ బాధ్యతను తప్పించుకోజాలదని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆస్తులపై కూతుళ్లకు హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. వృద్ధురాలైన తల్లికి భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో రిటైర్డ్ సైనిక శునకం ప్రయాణం

కేరళలో షాకింగ్ ఘ‌ట‌న‌ !! బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాకు చిన్నారి బలి

చార్ ధామ్ యాత్రికులకు అలర్ట్.. అది తప్పనిసరి

చాయ్ వాలాకు కోట్లలో ఆదాయ పన్ను.. అస్సలు రహస్యం తెలిసి కళ్ళు తేలేసారు

 

Follow us
Latest Articles