చాయ్ వాలాకు కోట్లలో ఆదాయ పన్ను.. అస్సలు రహస్యం తెలిసి కళ్ళు తేలేసారు
గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. టీ అమ్ముకునే వ్యక్తికి ఏకంగా కోట్లలో ఆదాయపన్ను నోటీసులు జారీ చేశారు ఆదాయ పన్నుశాఖ అధికారులు. నోటీసులు చూసి ఖంగుతిన్న ఆ చిరువ్యాపారి లబోదిబోమన్నాడు. అయితే ఈ విషయమై స్థానికులు కొందరు అతనిని మంచి న్యాయవాదిని సంప్రదించమని సలహా ఇచ్చారు. దాంతో అతను న్యాయవాదివద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. న్యాయవాదితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. టీ అమ్ముకునే వ్యక్తికి ఏకంగా కోట్లలో ఆదాయపన్ను నోటీసులు జారీ చేశారు ఆదాయ పన్నుశాఖ అధికారులు. నోటీసులు చూసి ఖంగుతిన్న ఆ చిరువ్యాపారి లబోదిబోమన్నాడు. అయితే ఈ విషయమై స్థానికులు కొందరు అతనిని మంచి న్యాయవాదిని సంప్రదించమని సలహా ఇచ్చారు. దాంతో అతను న్యాయవాదివద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. న్యాయవాదితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవగంజ్ కమొడిటీ మార్కెట్‌లో టీ విక్రయించే ఖేమ్‌రాజ్ దేవ్ అనే వ్యక్తికి గత కొంతకాలంగా తాను మోసానికి గురవుతున్నట్టు గుర్తించాడు. తాను టీ విక్రయిస్తున్న మార్కెట్ పరిధిలోనే బ్రోకరేజ్ వ్యాపారం చేస్తున్న అల్పేశ్, విపుల్ పటేల్ ఇద్దరూ తన పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించారని దేవ్ తెలిపాడు. కొన్నేళ్ల క్రితం వారివురితో తనకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ తన టీ షాపుకి వచ్చి టీ తాగి వెళ్లేవారని చెప్పాడు. 7వ తరగతి వరకే చదువుకున్న దేవ్ 2014లో తన బ్యాంక్ ఖాతాను పాన్ కార్డ్‌తో లింక్ చేసుకునేందుకు సాయం చేయాలంటూ అల్పేశ్, విపుల్ సోదరులను అడిగాడు. వారు దేవ్‌ను తన ఆధార్, పాన్ కార్డుతోపాటు ఒక ఫొటో కూడా ఇమ్మని కోరారు. దాంతో వారు కోరినవి ఇచ్చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆధార్, పాన్ కార్డులను దేవ్‌కి తిరిగి ఇచ్చారు. ఈ సమయంలో కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారని దేవ్ వివరించాడు. వారిద్దరే తనని మోసం చేశారని దేవ్ చెప్పాడు. ఈ క్రమంలో ఆర్థిక సంవత్సరం 2015, 2016 సంవత్సరాల్లో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్టు ఆదాయ పన్నుశాఖ గుర్తించింది. కాగా గతేడాది ఆగస్టులో దేవ్‌కి తొలిసారి ఐటీ నోటీసులు వచ్చాయి. అయితే తనకు చదువు రాకపోవడంతో ఆ నోటీసులను పట్టించుకోలేదు. తిరిగి రెండోసారి నోటీసులు రావడంతో మ్యాటర్ సీరియస్ అని దేవ్ గుర్తించాడు. సురేశ్ జోషి అనే న్యాయవాదిని సంప్రదించడంతో అసలు విషయం దేవ్‌కు అర్థమైంది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో తన పాన్‌కార్డుపై అక్రమ లావాదేవీలు నిర్వహించడంతో ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు అతడు గుర్తించాడు. తన బ్యాంక్ ఖాతాను దేవ్ పూర్తిగా తనిఖీ చేసి లావాదేవీలు ఏమీ జరగలేదని చెప్పాడు. కానీ అతడి పేరు మీద మరో అకౌంట్ ఉందని చెప్పడంతో షాకయ్యాడు. అవగాహన ఉన్న పలువురి సూచన మేరకు దేవ్ న్యాయవాదిని సంప్రదించాడు. అయితే విషయం ఎవరికీ చెప్పొద్దంటూ నిందితులు అల్పేశ, విపుల్ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ముళ్లు ఇద్దరిపై ఫోర్జరీ, మోసం కేసులు నమోదు చేశారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడ వేషంలో మగ దొంగలు !! తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్
క్యాన్సర్‌ని తరిమికొట్టే అద్భుత ఫలం.. ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి
అంత్యక్రియలకు రూ.30 లక్షలు.. అనాథ శవాల్లా వదిలేస్తున్న ప్రజలు