కేరళలో షాకింగ్ ఘ‌ట‌న‌ !! బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాకు చిన్నారి బలి

కేరళకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి కలుషితమైన నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ అయిన అమీబిక్‌ మెనింగోన్సిఫాలిటీస్‌ (బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా) తో మృతి చెందింది. మూన్నియూర్ పంచాయతీకి చెందిన చిన్నారి కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఆస్పత్రి వ‌ర్గాలు వెల్లడించాయి.

కేరళలో షాకింగ్ ఘ‌ట‌న‌ !! బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాకు చిన్నారి బలి

|

Updated on: May 24, 2024 | 9:18 PM

కేరళకు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారి కలుషితమైన నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ అయిన అమీబిక్‌ మెనింగోన్సిఫాలిటీస్‌ (బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా) తో మృతి చెందింది. మూన్నియూర్ పంచాయతీకి చెందిన చిన్నారి కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఆస్పత్రి వ‌ర్గాలు వెల్లడించాయి. బాధిత బాలిక‌ మే 1న సమీపంలోని చెరువులో స్నానం చేసింది. దీంతో మే 10వ తేదీ నాటికి జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని కుటుంబసభ్యులు తెలిపారు. కలుషితమైన ఆ నీటిలో స్వేచ్చగా జీవించే నాన్-పారాసిటిక్ అమీబా ఆమె ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాధిని సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించకపోవడం, వైద్య చికిత్స అందించడంలో అప్పటికే ఆలస్యం కావ‌డంతో బాలిక చ‌నిపోయిన‌ట్లు వైద్య నిపుణులు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చార్ ధామ్ యాత్రికులకు అలర్ట్.. అది తప్పనిసరి

చాయ్ వాలాకు కోట్లలో ఆదాయ పన్ను.. అస్సలు రహస్యం తెలిసి కళ్ళు తేలేసారు

Follow us