భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో కోటీశ్వరురాలైన భార్య.. ఎలాగంటే ??

పెళ్లి రోజు కానుకగా ఓ మహిళకు ఆమె భర్త తనకు నచ్చింది కొనుక్కోమని కొంత నగదు బహుమతిగా ఇచ్చాడు. అదే ఆమెను రాత్రికి రాత్రి కోటీశ్వరురాలిని చేసేసింది. భర్త ఇచ్చిన నగదులో ఆ మహిళ ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్‌ కొనింది. అనూహ్యంగా ఆమె జాక్‌పాట్‌ కొట్టి కోటీశ్వరురాలైంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లో భార‌తీయ మ‌హిళ‌కు ఈ జాక్‌పాట్ త‌గిలింది.

భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో కోటీశ్వరురాలైన భార్య.. ఎలాగంటే ??

|

Updated on: May 24, 2024 | 9:26 PM

పెళ్లి రోజు కానుకగా ఓ మహిళకు ఆమె భర్త తనకు నచ్చింది కొనుక్కోమని కొంత నగదు బహుమతిగా ఇచ్చాడు. అదే ఆమెను రాత్రికి రాత్రి కోటీశ్వరురాలిని చేసేసింది. భర్త ఇచ్చిన నగదులో ఆ మహిళ ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్‌ కొనింది. అనూహ్యంగా ఆమె జాక్‌పాట్‌ కొట్టి కోటీశ్వరురాలైంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లో భార‌తీయ మ‌హిళ‌కు ఈ జాక్‌పాట్ త‌గిలింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో భారత్‌లోని పంజాబ్‌కు చెందిన పాయలే అనే మహిళ 1మిలియ‌న్ డాల‌ర్లు అంటే రూ. 8.3 కోట్లు గెలుచుకున్నారు. ఏప్రిల్‌లో పెళ్లిరోజు కానుక‌గా భ‌ర్త ఇచ్చిన న‌గ‌దు బ‌హుమ‌తితో ఆమె ఆన్‌లైన్ ద్వారా లాట‌రీ టికెట్ కొనుగోలు చేశారు. మే 16న తీసిన డ్రాలో ఆమె కొనుగోలు చేసిన లాట‌రీ టికెట్‌కు జాక్‌పాట్ త‌గిలింది. దీంతో రూ. 8.3 కోట్ల భారీ ప్రైజ్‌మనీ ఆమె సొంతమైంది. గ‌త 12 ఏళ్లుగా ఆమె దుబాయి లాటరీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నార‌ట‌. ఏడాదికి ఒక‌టి లేదా రెండుసార్లు భ‌ర్త, పిల్లల పేర్ల మీద క్రమం త‌ప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పాయ‌ల్ తెలిపారు. చివ‌రికి భ‌ర్త ఇచ్చిన క్యాష్‌ గిఫ్ట్‌తో కొన్న లాట‌రీ టికెట్ త‌న‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింద‌న్నారు. ఇంత భారీ మొత్తం గెలుచుకోవ‌డం ప‌ట్ల ఆమె హ‌ర్షం వ్యక్తం చేశారు. ఇక తాను గెలుచుకున్న భారీ ప్రైజ్‌మ‌నీలో కొంత భాగం పిల్లల భ‌విష్యత్తు కోసం, మ‌రికొంత భాగం ఆస్ట్రేలియాలో ఉంటున్న త‌న సోద‌రుడికి సాయం చేస్తాన‌ని ఆమె చెప్పారు. ఈ సంద‌ర్భంగా దుబాయి డ్యూటీ ఫ్రీ లాట‌రీ నిర్వాహ‌కుల‌కు ఆమె ప్రత్యేకంగా ధ‌న్యవాదాలు తెలియ‌జేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరివాడినయ్యా !! అసలు కథ ఏంటంటే ??

ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??

ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో రిటైర్డ్ సైనిక శునకం ప్రయాణం

కేరళలో షాకింగ్ ఘ‌ట‌న‌ !! బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాకు చిన్నారి బలి

చార్ ధామ్ యాత్రికులకు అలర్ట్.. అది తప్పనిసరి

Follow us
Latest Articles