ఏసీ బోగీలో ఎలుకల బెడద.. సూట్ కేసులు కరకరా

ఇంట్లో స్టోర్‌ రూమ్‌లో వస్తువులను ఎలుకలు కొరికేయడం చూశాం.. అటకమీద పెట్టిన వస్తువులను కొట్టేయడం చూశాం. కానీ కదులుతున్న రైల్లో ప్యాసింజర్లు సీట్ల కింద పెట్టుకున్న వస్తువులను ఎలుకలు కొరికేయడం చూశారా? అది కూడా లగ్జరీ ప్రయాణానికి కేరాఫ్ గా చెప్పే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో చోటుచేసుకుంటే? కొందరు రైలు ప్రయాణికులకు ఇదే అనుభవం ఎదురైంది. కోల్ కతా నుంచి ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో ఇటీవలే ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఏసీ బోగీలో ఎలుకల బెడద.. సూట్ కేసులు కరకరా

|

Updated on: May 24, 2024 | 9:33 PM

ఇంట్లో స్టోర్‌ రూమ్‌లో వస్తువులను ఎలుకలు కొరికేయడం చూశాం.. అటకమీద పెట్టిన వస్తువులను కొట్టేయడం చూశాం. కానీ కదులుతున్న రైల్లో ప్యాసింజర్లు సీట్ల కింద పెట్టుకున్న వస్తువులను ఎలుకలు కొరికేయడం చూశారా? అది కూడా లగ్జరీ ప్రయాణానికి కేరాఫ్ గా చెప్పే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో చోటుచేసుకుంటే? కొందరు రైలు ప్రయాణికులకు ఇదే అనుభవం ఎదురైంది. కోల్ కతా నుంచి ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో ఇటీవలే ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఓ బాధితుడు రైల్వే శాఖ తీరుపై మండిపడ్డాడు. ఎలుకలు తన సూట్ కేసులు ఎలా కొరికాయో చూడండంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోను పెట్టాడు. వాటిని చూసిన నెటిజన్లంతా అవాక్కయ్యారు. బాధితుడు రైల్లో తన సూటుకేసును ఎలుకలు కొరికేసిన ఫోటోలు, వీడియోను తన ఎక్స్‌ ఖాతలో షేర్‌ చేస్తూ… తాను 12102 రైలు నంబర్ లో మే 19న ఎక్కానని, హెచ్ 1 కోచ్‌లో, ఏ2 సీట్లో ప్రయాణించానని, తన PNR నంబర్ తో సహా మెన్షన్‌ చేస్తూ.. నా సూట్ కేసులను ఎలుకలు కొరికేశాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు అర గంట నుంచి టీసీ కోసం ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్‌ చేశారు. దీనిపై రైల్వే శాఖ స్పందించింది. ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తోందని, వీలైనంత త్వరగా అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రైల్వే డివిజనల్ మేనేజర్ ద్వారా అతని ఫోన్ నంబర్ సేకరించాల్సి ఉందని, కావాలంటే railmadad.indianrailways.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. అలాగే 139కు డయల్ చేసి సత్వర పరిష్కారం పొందొచ్చని కూడా తెలిపింది. అయితే రైల్వే శాఖ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. రైళ్లలో శుచీశుభ్రత ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది సేవా లోపం కిందకు వస్తుందని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నామనే పేరుతో భారీగా చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ.. ఎలుకలు కొరకడంతో లగేజీ పాడైన ప్రయాణికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరి చివర గేదెలు మేపేందుకు వెళ్లారు.. అక్కడ కనిపించింది చూసి షాక్

బీట్‌రూట్‌తో ఇలా చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం

భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో కోటీశ్వరురాలైన భార్య.. ఎలాగంటే ??

కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరివాడినయ్యా !! అసలు కథ ఏంటంటే ??

ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??

 

Follow us