పెరగనున్న టోల్ ఛార్జీలు.. వాహనదారుల జేబుకు చిల్లు

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ ఛార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విషయంలో బిఓటి పద్ధతిలో విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు జిఎంఆర్ సంస్థ సిద్దమైంది.

పెరగనున్న టోల్ ఛార్జీలు.. వాహనదారుల జేబుకు చిల్లు

|

Updated on: May 25, 2024 | 11:03 AM

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్లీ టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ ఛార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విషయంలో బిఓటి పద్ధతిలో విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు జిఎంఆర్ సంస్థ సిద్దమైంది. జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్‌ప్లాజాలను జీఎమ్మార్‌ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్‌ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. నేషనల్ హైవే అథారిటీ నిబంధనల మేరకు ప్రతిఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్‌ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్‌ సంస్థకు ఎన్‌హెచ్‌ఏఐ కల్పించింది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టోల్ చార్జీల పెంపును ఎన్నికల సంఘం వాయిదా వేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ ధరలు అమల్లోకి వస్తాయి. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పెరిగిన టోల్ చార్జీలను పరిశీలిస్తే… కార్లు, జీపులు, వ్యాన్‌లకు రెండు వైపుల ప్రయాణానికి 5 రూపాయిలు, చిన్న లారీ 10 టైర్స్ వాహనంపై 10 రూపాయలు పెరిగాయి. వాణిజ్య వాహనాలతో పాటు భారీ గూడ్స్ లారీలకు 15 రూపాయలు పెరిగింది. మొత్తం ఐదు శాతం మేర టోల్ ఛార్జీలు పెంచినట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరి చివర గేదెలు మేపేందుకు వెళ్లారు.. అక్కడ కనిపించింది చూసి షాక్

బీట్‌రూట్‌తో ఇలా చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం

భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో కోటీశ్వరురాలైన భార్య.. ఎలాగంటే ??

కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరివాడినయ్యా !! అసలు కథ ఏంటంటే ??

ఇల్లు, డబ్బు తీసుకుని తల్లిని గెంటేసిన కూతురు.. ఆ తర్వాత ఏం జరిగింది ??

Follow us
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్